Saturday, 21 September 2013

Shivapuranam

శివపురాణము . … ,
శివ పురాణ మాహాత్మ్యము మొదటి అధ్యాయము ..
ఓం శ్రీ గణేశాయ నమః ,గురుభ్యొ నమః ,ఓం శివాయ నమః


ఒక సారి శౌనక ముని ,సూతమునిని అడిగారు ,మీరు  ఘ్యా నులు మీకు సర్వము తెలుసు . ఏది చేస్తే వివేక బుద్ధి కలుగుతుంది ,ఘ్యానము ఎలా కలుగుతుంది ?భక్తీ ఎలా లభిస్తుంది ?సాదు పురుషులు కోపాన్ని ఎలా తగ్గించుకుంటారు ?మనుషులలోఉన్న రాక్షస  భావాలు ఎలా తొలగుతాయి ?జీవులు పవిత్రతను ఎలా పొందగాలరో సెలవీయండి అని వినయముగా ఆడుగారు . .పెదావారి పట్ల గౌరవ భావాలు కలిగి మెలగాలి . వారు సంతోషించి నాలుగు మంచి మాటలు చెపుతారు . ఏవి చేస్తే మంచో , ఏది చేస్తే చెడో ?,తెలిసి ఉండుటే వివేక బుద్ధి ,


శౌనక ముని అడిగిన ప్రశ్నలకు సంతోష్ పడి , మీ మనస్సు కళ్యాణ ప్రదమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉంది . అందుకే నేను మీకు శివ పురాణము చెపుతాను . శివ పురాణము వింటే పాపాలు నశించి పోతాయి . మానవుడు పవిత్రుడు,
ఔతాడు శివుని ప్రేమ మయ ,దయామయ కళ్యాణ గుణాల పై ప్రేమ కలిగి శివ భక్తీ కలుగుతుంది . ఈ కథను సాక్షాత్ శివుడే ప్రవచనము చేసారు . తరువాత సనత్కుమార ముని వ్యాసులవారికి చెపితే వ్యాసులవారు ,ఈ పురాణాన్ని రచించారు . ఈ పురాణము  విన్నను  చదివినను ,సుఖ సంతోషాల సమృద్ధి కలిగి శివ సాయుజ్యము కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి .


ఈ పురాణము లో 24 వేల శ్లోకాలు ఉన్నాయి . ,ఏడు సంహితలు ఉన్నాయి .
ఓం శివాయ నమః


రెండవ అధ్యాయము .. . ,దేవరాజు అనే బ్రాహ్మణునికి శివ లోక ప్రాప్తి


అనగనగా దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు . అతను రసాలు అమ్ముకొని పొట్ట నింపుకునే వాడు . మెల్ల మెల్లగా వైదిక ధర్మాలు మానుకొని స్నాన్ సంధ్యలు సహితము మాని వేసి ,మెల్ల మెల్లగా మోసాలు చేయ టం మొదలు   పెట్టాడు ధనము పెంచుకో సాగాడు . చెడు స్త్రీల తో సాంగత్యము చేస్తూ అపవిత్రుడైయ్యి ,మహాపాపిగా మారి పోయాడు . ఒక సారి దైవ యోగాముతో ఝూసి అనే ఊరు చేరుకున్నాడు . అది ప్రయాగ దగ్గర ఉంది . అక్కడ ఓ శివాలయము ఉండేది . అక్కడ అతను విశ్రాంతి తీసుకున్నాడు . బాగా జ్వరము వచ్చినందున అక్కడే పడి  ఉందడిపోయాడు  శివాలయము లో శివుని కథలు జరుగుతున్నాయి . శివ లీలలు వింటూ, శివుని ప్రేమను నామామృతాన్ని త్రాగుతూ అదే జ్వరముతో కన్ను మూసాడు  . దైవ యోగము అంటే ఇదేనేమో !


చని పోగానే భీకరమైన యమ కింకరులు వచ్చారు . తీసుక వెళ్ళటానికి రాగానే ,చక్కని భస్మాన్ని ధరించిన శివదూతలు వారితో పోరాడి ,అతన్ని తీసుక వెళ్లి సాక్షాత్ శివునికి అప్పగించారు .


శివ దూతలు అచ్చంగా శివునిలాగానే ఉన్నారు . మెడలో రుద్రాక్షమాలల ధరించి ,,చేతిలో త్రిశూలము ,కాంతులు చిందే , ,  ఉజ్వల రూపము ,జటాధారులు , భయంకరమైన యమకింకరులను పారద్రోలి , సున్దరమై న శివ భక్తులు ,దయతో అతనిని శివుని చెంత చేర్చిన ,ఈతని భాగ్యమె భాగ్యము కదా !మృత్యు సమయాన శివుని గాధలు విని ప్రాణాలు వదిలి , పాపా లను పటాపంచలు చేసుకున్న దేవరాజు శివలీలామ్రుతాన్ని త్రాగి ధన్యుడైనాడు .


ఈ కథ వినగానే శౌనక ముని సంతోషించి ,శివ కథామృతం ఏంతో ో మధురముగా ఉన్నది ఇలాంటివి మరిన్ని కథలు చెప్పండి , అని వినయముగా అడిగారు .
ఓం శివాయ నమః .....


మూడవ అధ్యాయము ,
బిందుగ  బ్రాహ్మణుని కథ …
సూత ముని ఇలా పలికారు  నేను మీకు మరో కథ చెపుతాను . మీకు శివుని పట్ల ఉన్న భక్తిని చూసి నాకు చెప్పాలి అన్న కుతూహలము కలుగుచున్నది . మీరు వేద వేత్తలు ,నాకు ఉత్సాహము కలుగుచున్నది .


సముద్రమునకు దగ్గరలో బాశాకల అనే ఒక గ్రామము ఉండేది . అక్కడి ప్రజలు దుచార్ పూరితులు . కుటిల స్వభావులు . మోసాలు చేసే వారు పరస్త్రీ వ్యాహము ఉండేది . అలానే స్త్రీలు కూడా పరమ దురాచారులు . పర పురుషులతో తిరుగుతూ ,వారికి సతీత్వము అంటేనే తెలియదు , , ఐహిక మైన సుఖాలు మాత్రమె శాశ్వతము అనుకోని విచ్చలవిడిగా తిరిగే వారు . వారికి దేవుడు భక్తీ , త్యాగము ,ధర్మమూ అంటేనే తెలియని వారు , ,


ఇదే ఊళ్ళో బిండుగా అనే బ్రాహ్మణుడు ఉండేవాడు . వడిక కర్మలు తెలియని వాడుగ,తమ భార్య దగ్గరికి రాక ఊర్లలో పరస్త్రీలతో తిరిగేవాడు . మహాపాపిగా ఉంటూ కొన్నాళ్ళకు జబ్బు పడి కన్ను మూసాడు ఈయన భార్య చంచుల , పర ఊరినించి వచ్చిన కారణాన ముందు మంచి ఉత్తమము అయిన జీవితమూ గడిపి , కొన్నాళ్ళకు తను అందరిలా మారి పోయింది . భర్తా పోయాక కోడల్లమీద ఇల్లు వదిల ఇష్టము వచ్చినట్టు తిరిగి ఒక రోజుబంధువులతో  , గోకర్ణము అనే క్షేత్రాని వచ్చింది ,అక్కడి తీర్థములో స్నానము చేసి గుడికి వచ్చింది . శివుని దర్శనము చేసుకొని  అక్కడ ,పురాణ కాలాక్షేపము జరుగుతున్నది . అది వింటూ కూర్చుంది , ఆ రోజు కథలో పరపురుషుల వెంటే తిరిగే స్త్రీ కి ఎలాంటి శిక్షలు విదిస్తారో , పూజారి చెపుతున్నాడు . ,ఇట్టి స్త్రీలు నరకయాతనలు అనుభవిస్తారు ,ఇనుప కడీలు వేడి చేసి కామాన్గాలలో పెట్టి హింస పెడుతారు , లుహ పురుషుడి తో సంసర్గము చేయిస్తారు , ఆ జీవులు పడే హింసలు భరించలేక నరకము దద్దరిల్లుతుంది , అని చెప్పగా విని వణికి పోయింది . అందరు వెళ్లి పోయాక తను పూజారి కళ్ళు పట్టుకొని ఏడ్చి తమ సంగతి అంతా చెప్పుకుంది . మీరే నాకు తగిన ఉపాయము చెప్పండి అని బ్రతిమాలు కున్నది . అప్పుడు పూజారి పశ్చాతాపముకన్తె వేరే మార్గము లేదు ,నీవు పశ్చాతాప పాడుచున్నావు కనుక నీ భయము ఏమి లేదు .


ఇదే ఆలయము లో శివుని సేవ చేసి పురాణము వింటూ ఉంది పో అని చెప్పగా గుడి ని శుభ్రము చేస్తూ తీర్థము లో స్నానము చేస్తూ శివ నామము జపిస్తూ , కాలము గడిపుతూ ఉంటున్నది .


నాలగవ అధ్యాయము
శివ నామము రుచికి మరిగిన చంచుల , శివలోక గమనం



ఒక రోజు చంచుల కు  మృత్యువు రానే వచ్చింది . శివుని ధ్యానము లో నే ప్రాణాలు వదిలింది . ఉజ్వల తేజోమయమగు శివ దూతలు వచ్చి విమానము లో ఆమెను శివపురికి తీ సుకవచ్చి పరమేశ్వరుని వద్దకు చెర్చారు. అక్కడ శివుడు తమ సతీ సమేతముగా చిరునవ్వు తో ఆహ్వానించాడు , తమ ఎదుట ఈశ్వరుడు దయార్ద హృదయముతో నుండి , ఉజ్వల కాంతులతో ప్రకాశించే పరమేషుడు , అర్ధ చంద్ర ముకుటము ధరించి నీలమైన కంథము తో శోభిల్లుచు , చేతికి , మేడలో రుద్రాక్షమాలలు వేసుకొని , విశాలమైన ఫా లము పై మూడు కన్నుల శోభ . భస్మ వీభూతి రేఖలు పాల భాగానీ మరింత శోభాయమానము చేస్తూ ,భుజంగా మాలలు ధరించిన శివున్ని , తమ తల్లియగు పార్వతి దేవిని చూస్తూ తమ జన్మ ధాన్యము అయినది అని పొంగి పోయింది . వారినే  చూస్తూ నిలుచున్నా ఆమెను అందరి తల్లియగు పార్వతి దేవి ఆమెను కను సైగ చేసి దగ్గరకు రమ్మని పిలిచింది , చంచుల దేహము కూడా శివపురికి వెళ్ళగానే కాంతిమయము అయ్యి ఆమె కూడా శివునిలా మారింది , మందస్మిత యగు పార్వతీ మాత ను చూసి తమ జన్మ ధాన్యము అయ్యింది అని తలచి ఆనంద పూరితమైన అశ్రులతో తల్లికి ,శి వునికి నమస్కరించి ,ప్రక్కనే నిలబడింది ఆమె జన్మ జన్మల పాపాలు తొలగి పోయాయి . శివ పార్వతుల కరుణా మృ తములో  తడిసి పరిశుద్దురాలయ్యింది . పార్వతి దేవికి సఖిగా ఉండి ఆమెకు   సపర్యలు చేస్తూ హాయిగా ఉన్నది
ఐదవ అధ్యాయము ,- పిశాచ యోని నుండి బిన్దుగ కు విముక్తి


చంచుల అమ్మవారికి సపర్యలు చేస్తు ,సఖిగా ఉన్నది . ఆ తల్లి మందహాసము లో తడిసి పోతూ అమ్మవారి దివ్య సుగంధాన్ని శ్వాసలో నింపుకొని , ఆ తల్లి లేత పాదాల సేవ చేస్తూ , చక్కని సమయాన్ని గడుపుచున్నది , ఆమె సాంగత్య బలమే నెమో !గ త జన్మ లో ఉన్న తమ భర్త యొక్క  క్షే మాన్ని కోరి , ఇలా ఆలోచించ సాగింది ,” నా జన్మ ధన్య ము అయ్యింది కాని నా భర్త ఎ గతి చెందా డో కదా ? పాపమూ , ఎ పుణ్యము చేసుకోలేదు ,”అని దిగులుగా ముఖము పెట్టుకుంది ,
అది చూసి మందస్మిత  అగునట్టి ఆ తల్లి ,”ఏమయ్యింది ? నీవు దిగులుగా ఉన్నావు , చెప్పు నీ మనసులో ఏముంది ? చెప్పు .”అని మృదువుగా అలరించింది , అప్పుడు చంచుల అమ్మవారిని ఇలా ప్రార్థించింది , “అమ్మ , గిరిజా నందిని ,!స్కందమాత! ఉమా !నీవే సకల జీవ రాసుల కు ఉత్తమ గతిని ఇచ్చే దానవు ,నీవే సగుణ బ్రహ్మవు ,నీవే నిర్గుణ బ్రహ్మవు , నీవే ప్రక్రుతి ,నీవే విక్రుటివి . నీవే పరం పరమాత్మవు , నీవే ఈ సకల జగత్తును సృష్టించే దానవు . సృష్టి ,స్తితి పాలనా చేసేది  నీవే , ఈ అన్నిటి వెనకాల ఉన్నదు కూడా   నీవే , అని ప్రార్థన చేసి శాంతముగా నిల్చుంది . అప్పుడు జగన్మాత పార్వతి దేవి , ఏమి కావాలి అడుగు అంది ,   అది విన్న చంచుల,” అమ్మా నా భర్త అమీ అయ్యాడో తెలువదు ,ఆయన ఎలా ఉన్నారు ?ఎక్కడ ఉన్నారు , నేను మాత్రము నీ  చాయ లో హాయిగా ఆనందాన్ని అనుభవిస్తున్నాను . ఆయన క్షేమము కోరుతున్నాను అని చెప్పింది “
అప్పుడు ఆ తల్లి నీ భర్త  వేశ్యా గమనము చేసినందున ,చని పోయాక, నరక యాతనలు అనుభవించి ,
వింధ్య పర్వతము పై పిశాచ యోని లో తిరుగుతున్నాడు . శివ లీలలు వింటే ఈతని పాపాలు తొలగి పోతాయి అని చెప్పింది . మరి తల్లీ నీవే నా భర్తకు శివ పురాణము వినిపించే ఏర్పాటును కలిగించు అని ప్రాధేయ పడింది . అప్పుడు ఆ తల్లి కరుణ ,కటాక్షము వలన ,గంధర్వ  రాజు తుమ్బురును పిలిపించింది .

తుంబురుడు దివ్య గళ ము తో శివలీలు వినిపించి , శివపురాణ మును గానము చేసి అక్కడకు వచ్చిన వారికి ధన్యతను ప్రసాదించాడు . ఈ పిశాచ రూపము కలిగిన బిందుగా తమ పాప శరీరాన్ని తోలిగించుకొని ఉజ్వల రూపము పొంది , శివలోకాన్ని చేరాడు .వీరిద్దరిని శివ పార్వతులు తమ పార్శదు  లుగా నియమించుకున్నారు . ఈ విధముగా ఘోరమైన పాపులకు సహితము శివుడు తమ ప్రభావము చే వారికి పరిశుద్ధిని కలిగించిన , దయా గుణాన్ని చూ పిన శివ పర్వతుల చరణ  సేవ చేస్తూ కాలము గడిపారు . ధన్యులు అయినారు .

Tuesday, 3 September 2013

Bhagavatgita Part II

+
,ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః

ద్వితీయ అధ్యాయము :-

ఈ అధ్యాయము లో అర్జునుని విశాదమును తగ్గించ టకు, కృష్ణ పరమాత్ముడు , ఆత్మా తత్వమును చెపుతాడు . ఆత్మా తత్వము మిగితా అధ్యాయాలలో కంటే ఈ అధ్యాయము లో చాలా ఉంది .

సంజయ ఉవాచ ,
తం తథా కృపయా  విష్ట0అశ్రు పూర్ణా కులేక్ష్ణం
విశీదన్తమిదమ్ వాక్యమువాచ్ మదు సూద న :(1)

సంజయుడు చెప్పుతున్నాడు ,
“అశ్రు పూరిత నేత్రాలతో నున్న అర్జునున్ని చూసి , ఓదార్చటానికి వస్తున్నా కృష్ణుని , ఆలోచన అర్థం అయిన సంజయుడు ,ధృత రాష్ట్రుని తో
అంటున్న మాటలు ,” భగవాన్ మధు సూదనుడు , అర్జునుణ్ణి ఓదార్చటానికి అతని దగ్గరికి వెళుతున్నాడు . మధుసూదనుడు ,మధు అనే అసురుణ్ణి సంహరించినందున మధుసూదనా అన్నారు . ఆయన ధ్వని లో కృష్ణ పరమాత్ముణ్ణి , నీ పుత్రులు గెలువ గలరా అన్నట్టు ధ్వనిస్తున్నది .
“కృష్ణ పరమాత్ముడు,అర్జునుణ్ణి ,ఒడార్చటం కొరకు అంటున్న మాటలు , తమ కులాన్ని వీక్షించినందున  , నీకు మోహము ఆవహించింది …నేత్రాలు  అశ్రువుల తో నిండిన ,అర్జునుని తో ఇలా అంటున్నాడు . “

శ్రీ భగవాన్ ఉవాచ
కుత్స్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్ ,
అనార్య జుష్టం స్వర్గయమకీర్తికర్మర్జునా      (2)

“హే  అర్జునా !ఈ కాని సమయమందు నీకు మోహము ఎలా కలిగింది ? ఎందుకు వెనుకాడు తున్నావు ?ఎందుకంటే ఈ పని  శ్రేష్ఠులు  చేయ తగినది , గొప్పవారు చేయ వలసిన పని . దీని వలన నీకు స్వర్గము మరియు కీర్తి కలుగుతుంది .

ఈ మొహం నీకు అపకీర్తి ని తెస్తుంది ,యుద్దమందు వెనుకాడ రాదు .  పురు శార్థులు   చేయ వలసిన పని   కాదు . పిరికి తనము నీకు తగినది కాదు , ఈ సమయాన ఉండ కూడదు , కోప్పడుతున్నట్టు భగవానుడు చెప్ప సాగాడు . బుద్ధిమంతులు ఇలా చేయ కూడదు .

క్లైబ్యం మా స్మ  గమ:పార్థా నైతత్వ య్యుపపద్యతే
క్షుద్రం హృ దయ దుర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరం త ప    (3)

పిరికి వాడవు కాకు . నపున్సకుడివి కావద్దు  పార్థా !. కుంతీ కి మరో పేరు “,పృథా “ ఆ పేరు నుండి అర్జునినికి పార్థా అన్న పేరు వచ్చింది . ఈ సమయం  లో నీవు హృదయాన్ని దుర్బలం చేసుకోవద్దు . హృదయ దౌర్బల్యము తుచ్చమైనది . వాటిని విదిలించుకొని యుద్ధము కొరకు సిద్ధము కావాలి ముందటి శ్లోకాలలో కృష్ణ పరమాత్ముడు , గురుజనులతో యుద్ధము చేయుట ఎలా సముచితమో , తెలియ చేసారు …
అర్జునౌవాచ ,
 కథం భీష్మమ హం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ,
 ఇషుభి: ప్రతి యోత్స్యామి పూజార్ హా  వరిసూదన !!4!!

మధుసూదనా నేను  , పరమ  పూజనీయులైనాట్టి ,గురువు ద్రోణు లకు , మరియు భీష్మ పితామహులకు విరుద్ధముగా , బాణాలు ,ఎలా ప్రయోగించ గలను అరి సూధనా! ,మధు అను రాక్షాస్ సంహారము చేయుట వలన మధుసూదన , అరి అంటే వైరులను సంహరించు వాడు కనుక అరిసూదన అన్న పేరు వాడి పరమాత్ముని యందు ,ప్రీతి తో సంబోధిస్తూ , అరిసూదన నేను భీష్మ ద్రోనులను చంప గలనా !అని బేలగా అడుగుతున్నాడు అర్జునుడు .

గురూనహత్వా హాయ్ మహానుభావాన్చ్రేయో భోక్తుమ్భైకష్య మపీహ  లోకే
హత్వార్థ్ కామాన్స్తు గురునిహైవ భున్జీయ భోగాన్ రుధిర ప్రదిగధాన్            !!5!!

ఇట్టి మహానుభావులను  చంపక , భిక్ష ఎత్తుకోవటా ని కూడా నేను సంసిద్ధమే . వీరి రక్తము తో తడిసిన ఈ సుఖాలు నేను అనుభావిన్చలేను .

న  చైతద్విద్మః కత రన్నొ గరీయో యద్వా జయేం యది వా నో జయెయుః
యానేవ హత్వా న జిజీవిశామస్తే ..వస్థితా :ప్రముఖే ధార్త రాశ్ట్రా : !!6!!

అర్జునుడు కృష్ణ పరమాత్మ తో ఇలా చెప్ప సాగెను , కృష్ణా  యుద్ధము చేయక పొతే మంచిదా !చేస్తే మంచిదా నేను తేల్చుకోలేక పోతున్నాను . చేసినా గెలుస్తాము అన్నది సందేహమే వారిని మేము గెలుస్తామో లేదా వారే మామ్మల్ని గెలుస్తారో ్ తెలువదు ,వారిని చంపి మేము జీవిన్చలేము . యుద్ధము చేయుట క్షత్రీయ ధర్మమూ ,అలాగే   కుల నాశము మహాపాపము . కనుక కృష్ణా నీవే నాకు మార్గాన్ని సూచించమని అర్జునుడు కృష్ణున్ని వేడుకుంటాడు ఎవరు గెలుస్తారో తెలువదు .

కార్పణ్య దోశోపహతస్వభావ: పృచ్చామి త్వాం ధర్మసం మూఢ చేతా:
యచ్చ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిశ్యస్తె. . హం శాధి  మాం త్వాం  ప్రపన్నమ్ !!7!!

అందుకే కృష్ణ నన్ను పిరికి తనము ఆవహించింది , ధర్మ విషయాన మోహము ఆవహించింది , నిన్ను నేను శరణు వేడుకుంటున్నాను , నీవే నాకు మార్గము చూపు .
నేను నీ శిష్యుడను . అర్జునుని వద్ద ధర్మ సంపదా చాలా ఉంది . కాని అవసరానికి ఖర్చు  చేయని వారిని కృపణ అంటారు . ఇక్కడ అర్జునుడు తమకు అవసరము అయినట్టి ధర్మ నిర్ణయము తీసుకోవటాని ధైర్యము ఒప్పుకోక పోవుట వలన  కృపణ  అన్న పదము తనకోరకై వాడుకున్నాడు , లోభిగా వ్యవహరిస్తున్నాను కృష్ణా , మొఅహము ఆవహించిన కారణాన రాజోచిత నిర్ణయము తీసుకోలేక పోతున్నాను అని అం టాడు .

న హి ప్రపశ్యామి మమానుపాద్య చ్చోకముచ్చోషణ మిన్ద్రి రియాణాం ,
అవాప్య భూమాపంనంరుద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్య0. !!8!!

అర్జునుడు కృష్ణ పరమాత్ముని తో ఇలా అంటున్నాడు ,కృష్ణా ఈ యుద్ధము గెలిచాక,ఎక్కువకేక్కువ , ఈ ఆధిపత్యము మరియు రాజభోగాలు ,మరియు నిష్కంటకముగా రాజ్య పాలన దక్కుతుంది , ఈ రాజ్యమే కాదు, నాకు దేవతా సాన్నిధ్యము దొరకినా సరే , నా ఇంద్రియాల కు కలిగిన శోకము ను పోగొట్టే ఉపాయము మాత్రమూ నాకు కనిపించుట లేదు .
కనుక, నాకు మంచి తరు ణో పాయము నీవే చూపాలి  ,నాకు కలిగిన ఈ శోకము నుండి ముక్తి కలిగే మార్గము ఏదో అదే చూపు .

సంజయవ్  వాచా ,
ఎవ ముక్త్వా హృషీకేశం గుడాకేశ:పరంతప
న యోత్స్య ఇతి గోవింద మక్త్వా తూష్ణీం బభూవ హ !!9!!

సంజయుడు ఈ విధముగా పలికెను,” ఓ రాజ !”నిద్రను గెలిచినట్టి అర్జునుడు ,అంతర్యామి అగునట్టి గోవిన్డునితో ,మల్ళీ ఒక సారి  నేను  యుద్ధము చేయను అని చెప్పి మౌనముగా ఉండి  పోయాడు .

(“గోభిర్ వేద వాక్యైర్ విద్యతే ,లభ్యతే ఇతి గోవింద :. వేద  వాణి ద్వారా లభ్యము అయ్యే స్వరూపము ,”అందుకే ఇతను గోవిందుడు .” వేదైశ్చ సర్వైరహవేద్యః “సంపూర్ణ వేదాల ద్వారా తెలుసుకో వలసినది ,నేనే ,నన్నే !”).
తమువాచ హృషీకేశా :ప్రహసన్నివ భారత,
సెనయొరుభవొ మధ్యే విషీదంత మిదం వచ :!!10!!

భారత వంశ ధృత రాష్ట్రా !అంతర్యామి అయినట్టి  కృష్ణ పరమాత్ముడు ,నవ్వుతు సైన్యము మధ్యలో విలపిస్తూ  నున్న , . అర్జునుడు శోక నివృత్తిని కోరుట  చూసి అర్జునునికి ,నిత్య వస్తు అనిత్య వస్తువు ను చెప్పి సంక్య యోగ దృష్టి తో యుద్ధము ఎంత ముఖ్యమో చెప్పదలిచాడు .

శ్రీ భగవానువాచ ,
అశోచ్యానన్వశోచస్త్వం ప్రఘ్యావాదా 0శ్చ్ భాషసే ,
గతాసూన గాతాసూన్ష్చ నాను శోచంతి పండితా:!!11!!

అర్జునా !ఎవరి కొరకు నీవు దుఃఖించ తగదొ వారి కొరకు నీవు చిన్తిస్తున్నావు . పండితుడి లా మాట్లాడుతున్నావు .” ఎవరి ప్రాణాలు పోయాయో , గతాసు “వారి గురించి పండితులు ,దుఖపడరు . “అగతాసు “,ఎవరి ప్రాణాలు ఉన్నాయో వారి కొరకు దుఖించరు . నీవు పండితుడి లా మాట్లాడుతున్నావు కాని అనవసర విషయము కొరకు చిన్తుస్తున్నావు . కుల నాశము మహాపాపము అన్నందున ఆ మాటలు దృష్టి నుంచుకొని ఇలా అంటున్నాడు .
కృష్ణ పరమాత్ముడు ,”ఆత్మా అంతా  ఒక్కటే , నాశము లేనిది , అన్ని కాలాలలో మనము ఉన్నాము , నీవు నను వీరందరూ ఉంటున్నారు . ఎవరు ఎవరిని చం పలేరు.  అని నిత్య సత్  చిత్ ,అదే పరబ్రహ్మ అని చెప్పి ,అది ఉన్నది  ఒక్కటే వేరు ఎవరు లేరు అని నిరూపించి ,ముందుకు సాగుతాడు ,

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపా ,
న చైవం న భవిష్యామః సర్వే  వయ మత :పరం !!12!!

నేను లేని కాలమే లేదు ,అన్ని కాలలో నేను ఉన్నాను ,అన్ని కాలాలలో నీవు ఉన్నావు , వీరంతా కూడా అన్ని కాలాలలో  ఉన్నారు . ఉంటాము . శ్రీ కృష్ణుడు, అర్జునుడు , ఎవరు ఐతె ఉండరు ,చని పోతారేమో అన్న భయం వ్యక్తము చేసాడో వారు చావరు ,అంటే ఆత్మా కు చావు లేదు అని నిరూపించా సాగాడు . శరీరాలు పోతాయి కాని ఆత్మకు నాశము లేదు . ఆత్మా నిత్యమూ అని చెప్పి మరో పద్యము లో నిర్వికారము అని నిరూపిస్తాడు

కాగలవు . సుఖాలు పుణ్య ప్రభావము చేత లభిస్తాయి ...దుఖాలు పాప ప్రభావము    దేహినోస్మిన్ యథా దేహే,కుమారం యవ్వనం జరా ,
  తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి            !!13!!
జీవాత్ముడు కుమార దశ ,యవ్వన దశ వృద్ధా వస్తను  పొందినట్లే మరో శరీరము కూడా పొందుతాడు  , ధీర పురుషులు దీని కై శోచించరు  . జనము మరణము ,ఒక దశ క్రమము గా జరుగుతూ ఉంటాయి ,దేహ బాధ కలుగుతుంది కనుక కొందరు భయ పాడుతా రు ,ఇది శోకించవలసిన విషయము కాదు .

మాత్రా స్పర్శాస్తూ కౌన్తేయా ,శీతోష్ణ సుఖ్ దుఖదుఖదా:
ఆగమాపాయినో .. నిత్యా స్తాంస్తితిక్షస్వ భారతా :         !!14!!

ఓ కుంతీ పుత్రా , అంత : కరణ యందు ఉన్న శబ్ద , స్పర్శ ,గంధ ,రస , రూప , ఇవి ఇంద్రియాలపై తమ ప్రభావాన్ని చూపుతాయి ,వీటి ప్రభావము చేత మనిషి ఇంద్రియాలకు వశం అయ్యి రాగ ద్వేషాలకు లోన అయ్యి ప్రవర్తిస్తాడు ,(వీటినే శ్రీ కృష్ణుడు మాత్రా స్పర్శాలు అని పేర్కొన్నాడు . ఇవి తమ రెండు ప్రభావాలను చూపిస్తాయి పొందితే సుఖము పొందకపోతే దుఃఖము , ,హర్ష -శోకము , సుఖ్ -దుఃఖము, రాగ -ద్వేషము ,)ఇవి లభిస్తే రాగము కలుగుతుంది ,లభించకుంటే ద్వేషము ఏర్పడి మనిషి కోపిఅయ్యి ,ఇంద్రియాలకు  దాసుడయ్యి వ్యవహారము జరిపి పాపము పుణ్యము సంచయము లో చిక్కుకుంటాడు . వీటిని అర్జునా నీవు జయించు , వీటిని స హిన్చుకుంటేనే , ఓర్పు కలిగి వీటికి అతీతుడవు చే లభిస్తాయి కనుక అనుభవించి ఊరుకో ,ఇవి వాటి అంతల అవే అవే వస్తాయి ,పోతాయి  వీటిని సహించి ,ముందుకు సాగాలి . వీటి యందు ఆసక్తి ఉండకూడదు భారతా !

యం  హి న వ్యథ యంత్యేతే పురుషం పురుషర్షభ ,
సమ దుఃఖ సుఖం ధీరం సో .. మృత త్వా య కల్పతే !!15!!

సుఖాన్ని దుఖాన్ని సమముగా చూసే పురుషుడికి ,విషయాల పై ఆసక్తి బాధ కలిగించదు ,
మోక్షము కొరకు ప్రయత్నమూ చేసేది గా ఉంటుంది ,రెండిటిని సమముగా చూసే పురుషుడి కొరకు  ధీరుడు అన్న పదం వాడటం జరిగింది ,సుఖ- దుఖాలు రెండిటిపై  సమ భావము కలిగిన వాడు ధీరుడు ,

నాసాతో విద్యతే భావో నా భావో విద్యతే సత:
ఉభ్యయొ రపి దృష్టొంత స్త్వనయొ స్తత్వదర్శిభి :!!16!!

అసత్యము లేదు , అంటే అసత్యము కల్పితము , నిజముగా లేన్నట్టిది , సత్యమేమో ఎప్పుడు ఉండేది . కల్పితమైనట్టి ఈ శరీరాలు నిజముగా లేవు . ఆత్మా ఏమో సత్యముగా ఉన్నాది కనుక అశాశ్వత మైన ఈ శరీరాల గురించి బాధ పడకు ,రెండు విధాలా కూడా నీవు బాధ పాడుట తగదు

అవినాశి తు తద్ద్విద్ధి యేన సర్వ మిదం తతం ,
వినాశ మవ్య యస్యాస్య న కష్సిత్కార్తు  మర్హసి !!17!!

నాశము లేనిది ఆ దివ్య మైన ఆత్మా అది తెలుసుకో , అందులోనే ఈ యావత్ జగత్ ,కనపిస్తున్నా దృశ్య వర్గము ఇమిడి ఉంది ,అట్టి ఆత్మను ఎవరు నశింప చేయ లేరు .

అన్తవంత ఇమే దేహా నిత్యసోక్తా:శరీరిన:
అనాశినో ..ప్రమే యస్యా తస్మాధ్యుధ్యస్త్ర భారతా !!18!!

నాశ రహితము అయినట్టి జీవాత్మకు ఉన్న ఈ శరీరాలు అన్ని నాశము అయ్యేవి , ఇవి ఎలాగో పోయేవి, కనుక  నివు యుద్ధము చేయాలి.

య ఏనం వేత్తి హన్తారం యశ్చైనం మన్యతే హతం ,
ఉభొ తౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే    !!19!!

ఎవరైతే ఆత్మను చస్తుంది అని లేదా చచ్చింది  అని అనుకుంటున్నారో వారి కి ఆత్మా చావదు  , అని తెలియక అలా అనుకుంటున్నారు .ఆత్మా ఎవరిని చంపదు  , అది చావదు నిజానికి వీరికి తెలువక అలా అంటున్నారు .

న జాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూప:
అజో నిత్య :శాశ్వతోయం పురానో న హన్యతే హన్య మానె శరీరే        !!20!!

ఆత్మా ఏ  కాలము లో నైన చావదు ,దీనికి పుట్టుక, చావు రెండు లేవు . మల్లి పుడుతుంది అని కూడా లేదు ,ఎందుకనగా ,ఆత్మా ఆజన్మా , నిత్య సనాతనము . పురాతనము . శరీరము చచ్చినా ఇది చావదు .

వేదావినాశినం నిత్యం య ఎన మ జంవ్యయం
కథం స పురుష:పార్థ కం ఘాతయతి హన్తి కం !!21!!

“ఓ పృథా  పుత్రా అర్జునా” !ఎవరైతే ఈ ఆత్మను వినాశము లేనిదిగా , నిత్య ఆజన్మా ,అవ్యయం అని తెలుసుకుంటారో వారు ఎవరిని చంపలేరు ,చంపరు .  

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి
తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి !!22!!

ఏ విధముగా మనిషి జీర్ణము అయినట్టి వస్త్రాలు విడిచి కొత్త వస్త్రమును ధరిస్తాడో, అదే విధముగా ,జీర్ణము అయినట్టి ఈ శరీరాన్ని వదిలి మరో శరీరమును పొందు తున్నాడు .

నైనం చిన్దంటి శాస్త్రాని నైనం దహతి పావక:
నై నం క్లేద్యంత్యాపో న శోష్యతి మారుత:   !!23!!

పంచ భూతాలు సహితం ఆత్మను చంపలేదు అంటే ఇవన్ని కూడా ఆత్మలో నున్న విభిన్న రూపాలు ,శాస్త్రాలు చీల్చలేవు అగ్ని దాహించలేదు  నీరు కరగించలేదు ,గాలి ఆర్పలేదు ,శుష్కించ లేదు , ఆత్మా వీటి అన్నిటి కంటే అతీతమైనది ,

అచెద్యొ..యమదాహ్యొ..యమ క్లెద్యొ..శొశ్య ఏవ చ ,
నిత్య:సర్వగత స్థాణు ర చలోయం సనాతనా        !!24!!

ఆత్మా అచ్చేద్యము , ఆదాహ్యము ,అక్లేద్యము , అశోశ్యము ,అయినట్టి ఆత్మా నిత్యమూ , సర్వ వ్యాపి , అచలము స్థిరముగా ఉండే సనాతనము . ఆది అంట రహితముగా ఉన్న ఆత్మా లో ఈ సృష్టి చిన్న రేనువుంతా ఉంటుంది . మనము అందులో ఉన్నాము అఖండమైన ఆత్మా ఎంత ఉందొ మరి ?ఈ పంచ భూతాలూ అన్ని కూడా ఆత్మ యందునే ఉన్నాయి .

అవ్యక్తోయమ చిన్త్యో యమవికార్యో ముచ్యతే ,
తస్మాదేవం విదిత్వైనం నాను శోఛి తుమర్హసి !!25!!

మన కంటికి కనిపించని ఆత్మా అవ్యక్తము ,కనపడని కారణాన మనము చిన్తిo చలేము మనసు దీనిని పట్టుకోలేదు , అట్టి గొప్పగా నున్న ఆత్మా కోసం నీవు ఎ విధముగానైనా బాధ పడలేవు .

అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం
తథాపి త్వం మహాబాహో నైవం శొచితు మర్హసి   !!26!!

అయిన ను  నీవు ఒక వేళా ఆత్మను పుట్టేవాడు గిట్టేవాడు అని అ నుకున్నా ,నీవు శోకము చెందనవసరము లేదు , ఎందుకనగా తమ ధర్మానుసారముగా పొయ్యేదానిని  నీవు ఎ విధముగా నైనా ఆపలేవు . శోకము చెందలేవు . ..మరొ శ్లోకములో దీనిని విపులముగా చెపుతాడు .

జాతస్య హాయ్ దృవో మృ త్యుర్ ధృవం జన్మ మృ త్యుస్య  చ ,
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి       !!27!!

పుట్టిన వాడు గిట్టక మానదు ,గిట్టిన వాడు పుట్టి తీరుతాడు ఈ ధర్మాన్ని  నీవు ఆపుట కుదరదు కదా ?నీ చేతులో లేదు అందుకైనా నీవు శోకము చెందకు ,

అవ్యక్తాదీని భూతాని  వ్యక్త  మధ్యాని ి భారత ,
అవ్యక్త నిధనానేవ తత్ర కా పరిదేవనా              !!28!!

పుట్టుటకు పూర్వము నీవు చూడలేదు ,పోయాకా నీవు దానిని చూడలేక పోతున్నావు , మధ్యలో నుండి పోయిన దానికి నీవు ఏల చిన్తిస్తావు ?నీ వలన కాని పని నీవు చేయలేని పని , ముందు కనపడలేదు తరువాత కనిపించలేదు , మధ్యలో కనిపించి పోయింది . దానిని నీవు ఎ విధముగా నైనా పొందలేవు.  అందుకు దుఃఖించి ప్రయోజనము లేదు .

ఆశ్చర్యవత్  పశ్యతి  కశ్చిదేన మాశ్చర్య వద్దటి తతైవ్ చాన్య:
ఆశ్చర్యవచ్చైన మాన్య: శృ ణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్ !!29!!

కొంత మంది మహాపురుషులు ఆత్మ ను ఆశ్చర్యముతో చూస్తారు , కొందరు ఆశ్చర్యముతో వింటారు కొందరు ఆశ్చర్యముతో వర్ణిస్తారు మరి కొందరు విన్న తెలుసుకోలేరు .

దేహి నిత్యమవధ్యొయమ్ దేహే సర్వస్య భారత
తస్మాత్ సర్వాని భూతాని న త్వం శోచితుమర్హసి  !!30!!

అందరియందు పరమాత్ముడు పరిపూర్ణుడి  గా నిండి ఉన్నాడు నీవు ఎవరి కోసము కూడా చింతించకు . ఆత్మా అవినాశము , అందరిలో నిండి ఉంది . దానిని ఎవరు చంపలేరు . ఒకొక్క అణువు పరమాత్మ మాయం . అందరిలో ను ఉన్నాడు . అందుకు నీవు దుఖించకు .

స్వధర్మపి చావేక్ష్య న వికంపితు మర్హసి
ధర్మ్యాద్ధి యుద్దాచ్చ్రేయో న్యత్యక్ష త్రియస్య న విద్యతే !!31!!

నీవు నీ ధర్మాని ఆచరిస్తున్నప్పుడు భయపడవలసిన పని లేదు క్షత్రీయుల ధర్మము యుద్ధము చేయుట కదా . స్వధర్మాని ఆచరిస్తే , ఎటువంటి భయము అవసరము లేదు . యుద్ధము చేసిన వీరుడికి స్వర్గమొ లేదా మొక్ష్మో తథ్యము . కళ్యాణ ప్రదము కూడా .

యద్రుచ్చయా చోపపన్నం స్వర్గాద్వారమపావ్రుతం ,
సుఖిన;క్షత్రియ:పార్థ లభంతే యుద్ధమీద్రుశం     !!32!!

(దేశ్ క్షేమము కొరకు శత్రువులతో పోరాడి ,ప్రాణాలు సహితము లెక్క చేయని వారి కొరకు పరమాత్ముడు స్వర్గ ద్వారాలు , లేదా మోక్ష ద్వారము తెరిచి ఉంచుతాడు .) అర్జునా !ఇంతటి మహాభాగ్యము కొంత మంది భాగ్యవంతులైన క్షత్రీయుల కే  లభ్యము ,అట్టి స్వ త: సిద్ధముగా ఉన్న ఈ ద్వారాలను వదులుకోకు .
(దుర్యోధనుని వంటి దుర్మార్గుడు అతని వద్ద నున్న భీష్మ పితామహులు ,ద్రోణుని వంటి సమర్తులను సహితము అణగ దోక్కినట్టి దుర్మార్గులను చంపుట పాపము కాదు అని ఘ్యాప్తికి తీసుకోవచ్చి అర్థము అయ్యేలా , ముందరి శ్లోకాలలో తెలియ చేస్తాడు శ్రీ కృష్ణుడు ,)
మో

అథ చెత్వమిమమ్ ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ,
తత్:స్వధర్మం కీర్తించ్ హిత్వా పాప్మవాప్యాసి    !!33!!

కాని అర్జునా !నీవు యుద్ధము చేయకున్నట్టైతే , నీవు నీ స్వధర్మాన్ని వదిలిన వాడవి అయ్యి పాపము కలిగి , లభించ నున్నట్టి నట్టి కీర్తి చే జారి ,దుర్లభమైన భాగ్యము  పోగొట్టుకొని ,పాపిగా అపకీర్తి పాలవుతావు .

అకీర్తి చాపి భూతాని కథయిష్యన్తి తే వ్యయాం ,
సం భావితస్య చా కీర్తిర్ మర్ణాద్ తిరిచ్యతే         !!34!!

చాల కాలం వరకు ఈ అపకీర్తిని సహించుకోవలసి వస్తుంది , మర్యాదస్తులకు అపకీర్తి మరణము కంటే కష్టముగా ఉంటుంది .

భయాద్రణాదు  పరతం మంస్యన్తే త్వాం మహారథా :,
యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యాసి లాఘవం !!35!!

ఇంత  వరకు ఎవరైతే నిన్ను వీరుడు అని పోగిడే వారో వారే నిన్ను పిరికి వాడు , భయము తో యుద్ధము నుండి తలగి పోయాడు అని నిందిస్తారు . మర్యాదస్తులకు నింద  మృత్యు తుల్యముగా తోస్తుంది కనుక, అర్జునా నీవు యుద్ధము చేయవలసిందే !
అవాచ్య వాదానశ్చ్ బ హూన్ వదిష్యన్తి తవాహితా:
నిన్దన్తవ సామర్స్థ్యమ్ తతో దుఖతరం ను కిం !!36!

నీ వైరులు నిన్ను సామర్థ్య హీనుడు అని హేళన చేస్తారు , అంత  కంటే దుఃఖము ఇంకా ఏమైనా ఉందా ?

హతో వా ప్రాప్యాసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం ,
తస్మాదుత్తిష్ఠ కౌన్తెయా యుద్ధాయ కృత నిశ్చయా !!37!!

ఒకవేళ ఓడితే స్వర్గము లభిస్తుంది ,గెలిస్తే పృథ్వీ పై రాజ్యము లభిస్తుంది అం ్దుకె ఓ కౌన్తేయా
యుద్ధము చేయుట కై , ధృఢ నిశ్చయం చేసుకొని  సిద్ధముగా ఉండు .

సమ దుఖే సమె కృత్వా లాభా లాభౌ జయాజయౌ .
తతి యుద్దాయ యుజ్యస్వ నైవం పాప మవాప్యాసి !!38!!

సుఖాన్ని- దుఖాన్ని, సమానముగా తీసుకొని, జయాన్ని- అపజయాని ి ఒకేలా భావించి యుద్ధము చేయి దానివలన నీకు పాపము అంటుకోదు . కర్తవ్య  నిర్వాహణ అనునది ఒకటే ధ్యేయము కావాలి . కర్మ యోగాన్ని చెప్పదలచి ,అర్జునికి ధైర్యాన్ని ఇవ్వటము మొదలు పెట్టాడు . ఇంత  వరకు నీ బుద్ధి ఘ్యాన యోగాన్ని వింటున్నది ,ఇప్పుడు కర్మ యోగాన్ని విను .

ఏషా తే ..భిహితా సంఖ్యే బుద్ధి యోగే త్విమాం శృణు ,
బుధ్యా యుక్తో యథా పార్థం కర్మబన్ధం ప్రహాస్యసి       !!39!!

ఇంత  వరకు నీ  బుద్ధి ఘ్యాన్ యోగాన్ని విన్నాది ఇప్పుడు కర్మ యోగాన్ని వినుము .

నేహాభి క్రమ నాశోస్తి ,ప్రత్యవాయో న విధ్యతే
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ !!40!!

కర్మ యోగము లో బీజము నశించదు అంటే ,మనము లాభము నష్టము అని ఆలోచింపక ,ధర్మమూ అని చేస్తే వాటి వలన నష్టము జరుగదు, పైగా కొంచము చేసినను  ఏంతో పెద్ద విపత్తులను తొలగింప చేసేది గా ఉంటుంది . జన్మ మృత్యు భయాన్ని పోగొట్టేది గా ఉంటుంది .
ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసిన ధర్మమూ చాల గొప్పది .
వ్యవసాయాత్మికా బుద్ధిరేహేకే కురునందనా ,
బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధాయో వ్యవసాయినాం !!41!!

ఓ అర్జునా !ఈ కర్మ యోగములో నిశ్చయాత్మక మైన బుద్ధి ఓ నిర్ణయానికి వస్తుంది ,ఇందులోనూ ,ఎన్నో భేదాలు కలిగి ఉన్నాయి  , ఫలాపేక్ష కలిగి చేసే వారు , ఫలాపేక్ష లేకుండా చేసేవారు ,ఉంటారు.  ప్రతిఫలాన్ని ఆశించే వారి బుద్ధి లో ఎన్నో భేదాలు ఉంటాయి . . . ధర్మ బద్ధ నిర్ణయానికి వచ్చే వారి బుద్ధి ఒక నిశ్చయానికి వచ్చి తీరుతుంది .

యామిమాం పుష్పితాం వాచం ప్రదద్యంత విపశ్చిత:
వేద వాద రతా:పార్థం నాన్యదస్తీతి వాదినః              !!42!!

ప్రతిఫలాపెక్షలేకుండా చేసేది నష్టాన్ని కలిగించదు . ధర్మ రూపమైన కర్మ కొద్దిగా ఉన్న గొప్ప ఫలాన్ని కలిగిస్తుంది

కామాత్మానః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదామ్
క్రియావిశేష బహులాం భొగైశ్వర్య గతిం ప్రతి !!43!!
భోగైశ్వార్య ప్రసక్తానాం తథా ప్రవ్రుత చేతసాం ,
వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే !!44!!

స్వర్గాది సుఖాలకి పరితపించేవారు ఉంటారు . కొందరు ధనము ,పలురకాల సుఖాలకోరకు తాపత్రయ పడుతుంటారు . వారి కొరకు కామాత్మానః అన్న పదాన్ని వ్యక్త పరచడము అయ్యింది . వీటికి అంతే  లేదు ,ఒకటి తీర గానే మరోటి కావాలి , ఇవి అనంతాలు . పలు రకాల సుఖము పొందుట కోరకు ప్రయాస పాడుతారు . స్త్రీ కొరకు , పిల్లల కొరకు ,ధనము కొరకు కీర్తి కొరకు , కర్మలు చేస్తారు . కాని మోక్షము అనే ఒక పదము ఉన్నది మోక్షము ఏమిటి అని తెలుసుకోరు .  భోగ ఐశ్వర్యాల కొరకు సంచయము చేస్తూ గడుపుతుంటారు . స్వర్గాది సుఖాలు గొప్పవి అని అనుకుంటారు .

త్రైగుణ్య విషయా వేదా నిస్త్రైగుణ్యో భావార్జునా ,
నిర్ద్వాందో నిత్య సత్వస్థొ నిర్యోగా క్షేమ ఆత్మవాన్ !!45!!

ఈ సృష్టి లో ని అన్ని కార్యాలు మూడు గుణాల వలన ఏర్పడుతున్నాయి . సత్వ గుణం , రజో గుణం తమోగుణం . ఈ శరీరము ఇట్టి మూడు గుణాల ప్రభావము చే నిర్మిమ్పడింది , దీనిని త్యాగము చేయలేము . కనుక ,వీటికి అతీతము కావాలి అని ,అర్జునా నీవు నిస్త్రైగున్యావు కావాలి అని కృష్ణ పరమాత్ముడు చెపుతున్నాడు . ఈ శరీరము చేసే క్రియల పట్ల మమకారము ,ఆసక్తి,నేను శరీరాన్ని అన్నదే అహంత , వీటిని వదిలి వీటికి అతీతుడవు కావాలి అని ,చెపుతూ .. అంతః కరణ యందు విహరించు . ధర్మమూ గురించిన విచారణ మాత్రమె నీవు చేయి .

యవానర్థం ఉదపానే సర్వతః సంప్లుతోదకే
తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణ్యస్య విజానతః !!46!!

అన్ని వైపుల నుండి నీరు ఉన్నచో ఒక మనిషి అందులో నున్నప్పుడు చిన్న ,కొలను కొరకు చూడడు .సమ్రుద్ధి కలిగి నపుడు కొద్ది ఫలము కొరకు ఆశించడు . అదే విధముగా సర్వత్రా పరమాత్మవ్యాప్తిని గ్రహించన అతను  ,అతని  చింతనకు అలవాటు పడ్డ సజ్జనుడు ,స్వల్ప విషయాల కొరకు  తపించడు . సర్వ వ్యామైన పరమాత్ముని చింతన చేసే జనులకు , పరమాత్మ తప్ప మరోటి లేదు అని గ్రహిస్తాడు . తను ఉన్నది అతనిలోనే ,అని పూర్తిగా అర్థము ఔతున్ది .

కర్మణ్యే వాధికారస్తే ,మా ఫలేషు కదాచనా
మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగో సత్వ కర్మణీ 1147!!

నీవు కర్మ చేయ వలసిందే , అది నీ ధర్మమూ లేదా నీ అధికారము ,నేను ఈ కర్మ ను చేయను అని ఆలోచించకు . మనిషి గ పుట్టి ఏదో కర్మ ఆచరించడము జరుగుతుంటుంది , అదే సత్కర్మలను చేసి ,నీ కు లభించిన అధికారాన్ని సద్వినియోగ పరుచుకో .

యోగస్థ కురు కర్మాణి సంగ త్వక్త్వా ధనంజయ
సిధ్యసిధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే ,!!48!!

ఓ ధనంజయా !ఆసక్తిని వదిలి ,సిద్ధి అసిద్ధి లో సమానము బుద్ధి కలిగి నవడ  వయ్యి ్ యుద్ధము చేయి , నీ కర్తవ్యము నీవు  చేయి . సమత్వ బుద్ధి కలుగుటయే యోగము అనబడుతుంది .
దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యొగాత్ ధనంజయా ,
బుద్ధౌ శరణ మన్విచ్చ కృపణః ఫల హేతవే    !!49!!

సమత్వ బుద్ధి వలన బుద్ధి యోగము అనబడి , వాటి ఫలము వేరేగా ఉంటుంది , ఇందులో మమకారము , ఆసక్తి , కోరికలు అణచబడతాయి , వాటిని అణిచి వేయటం వలన ఏంతో  గొప్పగా రక్షణా సంబంధిత ఆచరణలు ,ఆలోచనలు కలిగి బుద్ధి సూక్ష్మము అయ్యి చక్కని పరిష్కారము అందుతుంది . అందుకే ఓ అర్జునా!నీవు బుద్ధి యోగాన్ని వాడి యుద్ధము చేయి , అల్పుని లా దీనునిలా మాట్లాడకు . అసహ్యకరముగా చేయకు .

బుద్ధియుక్తో జహాతీవ ఉభే  సుకృత దుష్క్రుతే ,
తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం !!50!!

సమబుద్ధి కలిగి చేసిన పని వలన లాభ నష్టము పాప పుణ్యమును పట్టించుకోరు తత్క్షణమే వాటికి అతీతము అవుతారు .సమయానికి సహాయము చేస్తూ , తక్షణ కర్తవ్యము గా భావించి చర్యలను తీసుకుంటారు . ప్రస్తుతము మనము చేయగలిగింది ఏమిటి అని ఆలోచించి ,తగు చర్య ను తీసుకుంటారు . అందు వలన వారు జయాపజయాలకు అతీతముగ వ్యవరిస్తారు .కర్మ యోగమే కర్మ బంధాలనుండి కాపాడగలదు . ఎన్నెన్నో జన్మల కర్మ బంధాలు యిట్టె దాటి వేస్తుంది కర్మ యోగము . మెల్లమెల్లగా సమత్వ బుద్ధి కలుగుతుంది ,
ప్రథమముగా సాధకుడు తమ కర్తవ్యాన్ని చేస్తాడు మెల్లమెల్లగా అందులోనిష్ణాతుడు అవుతాడు . సమత్వ  లక్షణాలు ఉంటె యోగ సిద్ధి జరిగినట్టే  .

కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మానీషిణః
జన్మ బంధవినిర్ముక్తా : పదం గచ్చన్త్యనామయం !!51!!

సమ బుద్ధి వలన బుద్ధి కుశలతను ప్రదర్శించి ఆసక్తి తగ్గించుకుంటారు భోగాలయండు నిరాసక్తి కలిగి ఉంటారు ఆసక్తే ప్రధానకారణం జనన మరణాకు .  . మూడు గణాల ప్రభావను తగ్గించుకుంటూ , సమతా స్థితి ని చేరుతారు.  మూడు గణాలే జనన మరణాలకు దారే చూపుతాయి,  ఆసక్తే లేకుంటే జననము లేదు . మరణము లేదు .

భోగాల కొరకే మనిషి మళ్ళీ పుడుతాడు , సమబుద్ధి వలన భోగాల కొరకు ప్రాకులాడ రు .
భోగేచ్చ లేనందున , చేసే కార్యాలలో అసలు ఆశలు ఉండవు . వారు నిర్వికార స్థితికి చేరు కుంటారు . రాగద్వేషాలకు , హర్షము -శోకానికి ,చలించకుండా ఉన్నవారిని నిర్వికార్ నిరామయ అని అంటారు నిర్వికార్ పరబ్రహ్మమందు లీనమౌతారు .  

యదా  తే మోహ కలిలం బుద్ధి ర్ వ్యతి తరిష్యతి
,తదా గతాన్సి నిర్వేదం శ్రోతవ్యస్య సృతస్య చ !!52!!

ఎ సమయములో నైతే నీ బుద్ధి మొహాన్ని వీడనాడుతుందో అదే క్షణం నీకు సమస్త భోగాలనుండి  వైరాగ్యము ఏర్పడుతుంది . “మోహ కలిలం “,ఒక విధమైన ఆవరణము, దాని వలన బుద్ధి అందులోనే తిరుగుతూ అక్కడే ఆగి పోతుంది , ఇది ఒక విధమైన కల్మషం ఒక విధముగా చెప్పాలి అంటే అవరోధము , దీని వలన బుద్ధి తన స్థిరత్వానికి రాకుండా ఆగి పోతుంది . స్తిర్ బుద్ధి కలిగితే పరమాత్మ ప్రాప్తి జరుగుతుంది . ఇది వరకు విన్నవి , వాటి గురించి ఇహ పరలోక విషయాలు తెలిసిపోతాయి . స్తిర్ బుడ్డి ఏర్పడితే సమస్త భోగాల్నుంది వైరాగ్యము ఏర్పడుతుంది .

1-)కర్మ యోగము -ఈ యోగము లో లో శ్రద్ధ ఏర్పడటానికి ,కర్తవ్యము చేయ మన్నారు .
ఈశ్వరునితో సంబంధము ఏర్పడటం వలన యోగి అనబడుతాడు . (ఈశ్వర్ ,దేవి కృష్ణ )ఎవరి యందు భక్తీ చేయగా బుద్ధికి స్థిరత్వము కలుగుతున్న దో  )వారిని యోగి అని చెప్పబడుతున్నది . గీత లో పలు చోట్ల ఈ పదాలను మళ్ళీ మళ్ళీ వాడారు .
కర్తవ్య పారాయణ దిక్షితులను కర్మ యోగి ,అని చెప్పా బడింది .

2)ధ్యాన్ యోగము -గాలి లేని స్థలమందు దీప జ్యోతి ఎ విధముగా స్థిరముగా వేలుగుతుందో ఆదే విధముగా జ్యోతి రూపము లో ప్రకాశించే ఆత్మా స్థితిని యోగము అంటారు అంటే ఎక్కడ ధ్యాన యోగము గా పెర్కున్నారు .    
అందరిని తమ తో సమానముగా భావించే వారిని ,మన ఆత్మా స్కారూపమే వారు అందరు అని తలచి మెలిగే వారిని ఆత్మా ఘ్యాని అని చెప్పబడుతారు .
3)యోగము లో స్థిరము ఏర్పడి ,ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించే వారిని ఆత్మఘ్యాని అంటారు .
4)భగవత్ ప్రభావ యోగము -ఇందులో ఆశ్చర్ జనకమైన ప్రభావాని వర్ణించారు , కర్మ యోగి కేవలం తన ఆత్మను పరిశుద్ధి చేయుటకై కర్మలను ఆచరిస్తారు .
5)భక్తీ యోగము -అవభిచార్ భక్తీ ,అంటే ఎ భగవంతుడైనా ఆ దివ్య పరమాత్ముని రూపమే అన్న దృడ సంకల్పము కలిగి ఎ దేవుణ్ణి కొలిచినా ఆ పరమాతమనే అని భక్తీ తో కొలుస్తారు .
ఇలా భక్తీ చేసే వారిది భక్తీ యోగము అనబడుతుంది . ,
 6)అష్టాంగా యోగము ,-భక్తుడు నిత్య నిరంతరమూ భక్తీ లో ఆత్మా చింతనలో నిమగ్నమై ఉంటాడు .

సాంఖ్య యోగము - అణువూ అణువూ పరమాత్మ మాయం అన్న యోగము సాంఖ్య యోగము

శృతి విప్రతిపన్నా తే యదా స్థాస్యసి నిశ్చలా
సమాధావచలా బుద్ధిస్తదా యోగామవాప్యాసి !!53!!
రకరకాలుగా విన్న నీ బుద్ధి విచిలతమయి ,ఉన్నది కావున ,నీ బుద్ధి పరమాత్మ లో స్థిర0  అయినపుడు నీవు యోగాన్ని పోదినవాడవు అవుతావు . అప్పుడు నీకు కలిగిన సందేహాలు అన్ని తొలగి పరమాత్మ తో నీవు నిత్య సాంగత్యములో ఉండి ,ఎప్పడికప్పుడు నీ సందేహాలు తోలగుతుంటాయి .
(పరమాత్ముడు అర్జునునికి ఆత్మా  గురించి వివరించి నపుడు , ఆత్మా ఒకటే సత్యము ,మరణము పుట్టుక లేనిది , శరీరాలు నశించేవి వీటి కొరకు నీవు విచారిచ తగదు అని ,అర్జునుడు  స్వజనుల కు అరిష్టము జరుగుతుందని భయ పడినందున ,భయం తొలగుట కొరకు , చెప్పి ఆత్మాయొక్క ప్రభావము చెప్పి ,నీ కర్తవ్య నిర్వాహణ చేయుటయే నీ ధర్మమూ అని కర్మ యోగాన్ని బోధించాడు , రాజు  వుఅగుట  చే నీ రాజ్ ధర్మాన్ని నీవు నిర్వహించ వలసినదే ,అని చెప్పి, పరమ్మత్ముని లో నినీ బుద్ధి మనసు నిలుపుట వలన నీకు ఏకాగ్రత లభిస్తుందని చీపి , లక్ష్య సాధన లో చిత్తము నిలిపే ఉపాయమే చెప్పాడు , మన కృష్ణ పరమాత్ముడు . పరమాత్మతో తాదాత్మ్యము చెందుట ఏ యోగము ,సతతము అతని ధ్యాసే ఉండుట వలన , మనకు కలిగే ఆలోచనలకు అతనే మంచి దారి కల్పించి , మంచి ఆలోచనా శక్తి ని ప్రేరేపిస్తాడు ).
అర్జునౌ వాచా ,

స్థిత ప్రఘ్యస్య కా భాషా సమాధిస్థస్య కేశవా ,
స్థి తధీ:కిం ప్ర భాషే్త కిమా సీత  వ్రజెత కిం !!54!!

స్థిత ప్రఘ్య పురుష లక్షణాలు ఏమిటి ? నిరాకారముగా నున్న ప్రకాశాత్మను కొలిచే వారి లక్షణాలు ఏమిటి అతని నడువడి ఎలా ఉంటుంది ?ఎలా సంభాషిరస్తారు?
కే ..శ.. వా !బ్రహ్మ విష్ణు మహేశ్వర ,కలిసి అన్ని తానైనటువంటి వాడు , సృష్టి , స్థితి లయ కారకుడు అయినట్టి పరమాత్మ !సర్వఘ్య అయినట్టి కృష్ణా స్థిత ప్రఘ్య పురుషుడు ఎలా మె  లుగుతాడు ? అని ప్రశ్నించాడు .
శ్రీ భగవానువాచ ,
ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థం మనోగతాన్
ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రఘ్యస్తదోచ్యతే !!55!!

 స్థిత ప్రఘ్య పురుషుడు ,ఎల్లాప్పుడు ఆత్మనే తలుస్తూ , ఉండడము వలన మనసులోని అన్ని కోర్కెలను త్యజించి వేస్తాడు . స్వల్పమైన వస్తువుల కొరకు తపన మాని పరమాత్మ కోసము తపిస్తూ ఉండడము చేత ,మిగితా విషయాల పట్ల ఆసక్తి పూర్తిగా తగ్గి పోతుంది .

దుఖేష్వనుద్విగన మనాః సుఖేషు విగత;స్పుర:
వీత రాగ  భయ క్రోధ:స్థిత దీర్మునిరుచ్యతే ,!!56!!     

దుఖాలు  కలిగినపుడు మనసులో ఉద్వేగాలు తొలగించుకొని ,సుఖాలు కలిగినపుడు శాంత చిత్తముతో ,నిస్పృహగా మెలగటం ,తెలుసు , స్థిత ప్రఘ్యుడికి ,లక్షణాలు వాణీ  శుద్ధి ఉన్నా హృదయములో ఇంద్రియాలలో వికారాలు ఉంటె స్థిత ప్రఘ్యత అనిపించుకోదు . అలా అని ,వాణీ  శుద్ధి లేకున్నా స్థిత ప్రఘ్యత అనిపించుకోడు .హృదయ పరిశుద్ధి జరిగిన పిదప వాని శుద్ధి ఉండాలి . పరిశుద్ద హృదయము , ఇంద్రియ నిగ్రహము రెండు ఉంటేనే స్థిత ప్రఘ్య లక్షణాలు ఉన్నట్లు లెక్క .
దుఖాలలో  చలించకుండా ఉంటూ , సుఖాలలో పరుగులు తీయక యోగి తన సాధనను కోసాగిస్తాడు , మనసు ఎటువంటి  కోరికలకు లొంగదు . అదే నిర్వికార స్తితి .

య: సర్వత్రాణ భిరనేహస్త త్తత్ ప్రాప్య శుభాశుభమ్ ,
నాభి నన్దతి న ద్వేష్టి తస్య ప్రఘ్యా ప్రతిప్రతిష్ఠితా   !!57!!

సాధకుడు మమతారూప జాలమునుండి తప్పుకుంటాడు , తమ బంధు వుల , పట్ల ఉన్న స్నేహాన్ని తొలగించుకొని , ఆసక్తి రహితుడుగా ఉంటాడు . అప్పుడే స్థిత ప్రఘ్యత వచ్చినట్లు అర్థము .మనకు  మోహ జాలము ఉన్నంత సేపు , ఆసక్తి వీడము  . ఆసక్తి తీరితే కాంక్ష , తీరకుంటే ద్వేషము ఇవి ఉండేవే, ఇవి మళ్ళీ మనను జనన మరణ బంధాలలో కట్టి పెడుతుంది  . అందుకే వీరికి ద్వేషము ఉండదు ,ద్వేషము ఉంటె వారికి కీడు కలగాలని మనసు అంతర్గతముగా భావిస్తూ ,అటు  ఎదుటి వారికి ,ఇటు స్వంతానికి హాని జరిగేట్టు చేసి ,మనను ముందు జన్మలకు ప్రోత్సహిస్తుంది . అందుకే   ఆసక్తి ఉండకూడదు బంధువుల పట్ల స్వజనుల పట్ల మోహము మనను ఆకర్షించి వారి సనిధ్యాన్ని కోరుకుంటుంది , వెళితే వారికి నచ్చక పొతే బాధ కలిగి ,ద్వేషము ఏర్పడు తుంది, వారు మంచిగా స్పందిస్తే రాగము ఏర్పడి మల్లి మల్లి వెళ్ళాలి అని మనసు చంచలము ఔతున్ది ఇక్కడ శ్రీ కృష్ణుడు , ఇట్టి ఆసక్తి తొలగాలాని చెప్పటము జరుగుతున్నది .   (మోహము ప్రేమ ఒకేలా ఉంటాయి అది ప్రేమో ,మోహము అర్థము చేసుకొనుట కష్టము   మును మందు  శ్లోకాలలో దీనిని విపులముగా విషద పరిచాడు శ్రీ కృష్ణ పరమాత్ముడు .  ఇది  మన అందరి పట్ల జరిగే మాయా జాలము ప్రతి మనిషి స్వంత వారికోసమే ఎక్కువ పరితాపము చెందు  తుంటాడు ,మనకు ఏం తో అవసరము అయినట్టి శ్లోకము  . )ఇక్కడ న ద్వేష్టి అని అనటం  జరిగింది న ద్వేష్టి , ఎటువంటి వారిని చుసిన వారి తో సాంగత్యము ఏర్పడిన వారి భావలనుండి  అసంగాతుడుగా ఉండ గలడు  యోగి ,వారిలో  వీరి దుర్భషలతో కాని మంచి తో కాని ఎట్టి  చలనము జరుగదు .
అందు వలన స్థిర చిత్తముతో వారి పట్ల ప్రేమ తో మెలగి వారి అభిమానాన్ని పొంద  గలడు స్థిత ప్రఘ్యుడు .
ఓం శ్రీ కృష్ణ పరమాత్మనే నమః
యదా సంహరతే చాయం కూర్మోన్గానీవ సర్వశః
ఇంద్రియాణీ న్ద్రి యార్థే భ్యస్తస్య ప్రఘ్యా ప్రతిషఠితా!!58!!

తాబేలు తమ శరీర అవయవాలను ,ముడిచి ,వీపు చిప్పలో దాచినట్లు ,యోగి తమ ఇంద్రియాను ముడిచి బంధిస్తాడు ,కోరికలను తమ ఆధీనములో ఉంచుతాడు . స్వల్ప విషయాలకు లొంగక  తమ యావత్ ధ్యాస్,  ఎకమత్రా పరమాత్ముని పొందుటకై  పెట్టి పరమాత్మ చింతనలో గడుపుతాడు . (ఇవాళ నాకు ఇది అవసరము అనుకుంటాము , రేపు మరోటి దీనికి అంతు  లేదు కనుక తమ ప్రాప్తి యందు సంతోషము గా ఉండుట అవసరము,ఉద్యోగమూ పురుష లక్షణం .. పని చేయాలి ,ఉద్యోగ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించాలి , దొరికిన దాంట్లో బ్రతుకు గడుపుటకై ఆచి తూచి నడుచుకొనుట అవసరము విషయాసక్తిని అదుపు లో ఉంచాలి . )
విషయా వినివర్తన్తే నిరాహారస్య దేహిన;
రసవర్జం రసో ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే !!59!!

ఇంద్రియాలకు సంబంధిత ఆసక్తి తగ్గించు  కుంటాడు . నిరాహారము అన్న పదం ,ఆ యా ఇంద్రియాలకు సంబంధించిన కోరిక ల పట్ల ఆసక్తి తగ్గించుట , ఇంద్రియాలను అదుపులో ఉంచుట అన్న పదానికి వాడారు . . లోపల కోరిక ఉంటె ఆసక్తి కలిగి ఉంటారు . ఆసక్తి కర్మ బంధాలలో పడేసి ఉంచుతుంది .  
ధ్యాన సమయము లో యోగి తమ కోరికలు త్యజిస్తాడు కాని లోపల ఉంటె ,  సాధన సాగదూ  . కనులు ఓటి కోరుతాయి , చెవులు వినాలి అంటాయి కాళ్ళు  మనసు ఎటు లాగితే ఆటే వెళుతాయి , అంటే ఆయా సంబంధాలలో చిక్కి ఉండుట . ఇంద్రియాలు రసాన్ని ఆస్వాద0 చేస్తాయి అవి పరమాత్ముని చింతన చేస్తే ,మెల్ల మెల్లగా విశయా స క్తి తొలుగుతుంది . రసాస్వాదన  విడిచి వేస్తాడు . పరమాత్మ సాక్షాత్ కారము కాగానే అవి అన్ని తొలగుతాయి .

యాతతో హ్యాపి కౌన్త తేయా పురుషస్య విస్చిత:
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్తి ప్రసభం మన;       !!60!!

అర్జునా !ఆసక్తి తగ్గ క పొతే , ఇంద్రియాలు బలవంతముగా, బుద్ధి మంతుని మనస్సును కూడా లాగేసు కుంటాయి , అందుకే ముందుగా పరమాత్మునికి ఈ ఇంద్రియాల ను ఆధీనము చేయాలి ,పరమాత్మ చింతనతో ఈ ఇంద్రియాలు , అతని వశము అవుతాయి ధ్యానము లో స్తిర్ చిత్తము ఏర్పడుతుంది . నిర్విఘ్నముగా సాగుతుంది .
ఈ రోజాటి  గీతార్థము ,ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పర;
వశే హి  యస్యేన్ద్రియాణి  తస్య ప్రఘ్యా  ప్రతిష్థితా!!61!!

సాధకునికి  తమ ఇంద్రియాలు  వశము లో ఉంటేనే స్థిర బుద్ధి ఏర్పడుతుంది . రాగ ద్వేషాలు లేనందున ఆత్మా ప్రసన్నత ను అనుభవించగలడు .

ధ్యాయతో విశయాన్ పూంస :సంగస్తే షూపజాయతే ,
సంగాత్సంజాయతే కామః కామాత్ క్రోదోభిజాయతే    !!62!!
క్రొధాత్ భవతి సంమోహః సంమోహాత్స్మ్రుతి విభ్రమః
స్మ్రుతిభ్రంశాద్ బుద్ధి నాశో , బుద్ధినాశాత  ప్రణ శ్యతి !!63!!

పదే పదే విషయాలను తలువ కుండా ఉండడమే ఉత్తమం తలపు మ నను మళ్ళీపాప పుణ్యాల    వలయం లో పడేస్తుంది , మళ్ళీ ఆసక్తి పుడుతుంది ఆసక్తి తీరక పొతే కోపము వస్తుంది . కోపము వస్తే బుద్ధి ఉత్తమ మైన నిర్ణయాలు తీసుకోలేదు ,

రాగ ద్వేష్ వియుక్తిస్తూ విషయా నినింద్రై స్చరన్
ఆత్మా వశైయర్ విదేయాత్మా ప్రసాదమది గచ్ఛతి !!64

తమ ఆధీనములో ఇంద్రియాలను ఉంచుకున్న వాడు విషయాలను అనుభవిస్తూ కూడా ఆత్మా ప్రసన్నత ను అనుభవించ గలదు .

ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తే షూపపజాయతే
సంగాతసంజాయతే కామః కామాత్ క్రోదోభిజాయతే   !!65!!



విషయాలను ఆలోచిస్తే వాటిపై మోహము కలిగి ఆసక్తి పుడుతుంది ఆసక్తి నుండి కోరిక పుట్టి , అది తీరకుంటే కోపము వస్తుంది ,తీరితే మళ్ళీ  రాగము కలిగి మళ్ళీ మళ్ళీ అదే విషయము కొరకు తపన చెందుతూ , మన ఆత్మా శాంతిని మనము పొందలేము . కోరిక తీరితే మళ్ళీ వెళుతాము తీరకుంటే కోపము వస్తుంది , ఇదే రాగము ,ద్వేషము . .

తీస్తున్నదనాస్తి బుద్ధి ర్ యుక్తస్య న చాయుక్తస్య భావనా
న చాభావయతః శాంతిశాన్తస్య కృతః సుఖం !!66

క్రోధము లో బుద్ధి మూఢము ఏర్పడి స్మృతి  భ్రంశము కలిగి,  మంచి నిర్ణయాలు తీసుకోలేము స్థిర చిత్తాన్ని కోల్పోయి న ప్పుడు తప్పుడు  నిర్ణయాలు తీసుకొనే ప్రమాదము ఉంది . ప్రసన్నత ఉన్నప్పుడు మన నిర్ణయాలు సరిగ్గా ఉంటాయి పాపాలు నశిన్చాగానే ,అం తః కరణ శుద్ధి అయ్యి సాత్వీకమైన ప్రసన్నత లభిస్తుంది . ఈ ప్రసన్నత కలగగానే సుఖ దుక్ఖాలతో మనకు పని ఉండదు ,అంటే సాధకుడు వీటికి అతీతము అయ్యి , వీటిని పట్టించుకొనే స్థితిని దాటి పోగలదు .
ఆ సమయాన ధర్మమూ ఆలోచించి మసలుకొనే స్థి తిని చేరగలడు సాధకుడు .
మనసు ,ఇంద్రియాలు మన ఆధీనము లో లేకుంటే సుఖము ఎక్కడిది ,శాంతి లేనప్పుడు సుఖము ఎలా కలుగుతుంది ?
(విషయాల పట్లు మనసు తిరుగుతున్నంత సేపు మనిషికి స్తిర చిత్తము ఏర్పడదు . ఇది కాకుంటే ఇది , ఎక్కడో స్వార్థమే వెతుక్కుంటూ ఉండే మనసుకు  భగవత్ ధ్యానమే గతి . ఇది చేయగా చేయగా శాంతి కలుగుతుంది ,)

ఇంద్రియాణాం హాయ్ చరతాం యన్మనోను విధీయతే
తదస్య హారతి ప్ర ఘ్యా వాయుర్నావమివాభసి !!67!!

నీటి లో ప్రయాణించే నావను గాలి తన వైపుకు లాగుతుంది ,అదే విధముగా ,మనిషి ఎ ఇంద్రియాలకు లోన్గుతున్నాడో అదే విషయం మనిషిని తన వైపుకు లాగేసుకుంటుంది . నిశ్చయ బుద్ధి ఏర్పడని వ్యక్తిని విషయ లోలత లాగేసి అశాంతికి గురి చేస్తుంది , ముందటి శ్లోకములలో చెప్పినట్టు , కోరిక తీరితే ఆసక్తి కలిగి అటు వైపు మళ్ళీ  మళ్ళీ  వెళ్ళాలి అని తపన పడు తుంటాడు , కోరిక తృప్తిని ఇవ్వక పొతే , కోపము తో వ్యవహారము చేసి అసూయ ద్వేషాలను ప్రదర్శించి ,సాటి మనుషులతో మెలుగుతాడు ,ఇది మళ్ళీ పతనానికి దారి ి
.తీస్తున్నది