Saturday, 21 September 2013

Shivapuranam

శివపురాణము . … ,
శివ పురాణ మాహాత్మ్యము మొదటి అధ్యాయము ..
ఓం శ్రీ గణేశాయ నమః ,గురుభ్యొ నమః ,ఓం శివాయ నమః


ఒక సారి శౌనక ముని ,సూతమునిని అడిగారు ,మీరు  ఘ్యా నులు మీకు సర్వము తెలుసు . ఏది చేస్తే వివేక బుద్ధి కలుగుతుంది ,ఘ్యానము ఎలా కలుగుతుంది ?భక్తీ ఎలా లభిస్తుంది ?సాదు పురుషులు కోపాన్ని ఎలా తగ్గించుకుంటారు ?మనుషులలోఉన్న రాక్షస  భావాలు ఎలా తొలగుతాయి ?జీవులు పవిత్రతను ఎలా పొందగాలరో సెలవీయండి అని వినయముగా ఆడుగారు . .పెదావారి పట్ల గౌరవ భావాలు కలిగి మెలగాలి . వారు సంతోషించి నాలుగు మంచి మాటలు చెపుతారు . ఏవి చేస్తే మంచో , ఏది చేస్తే చెడో ?,తెలిసి ఉండుటే వివేక బుద్ధి ,


శౌనక ముని అడిగిన ప్రశ్నలకు సంతోష్ పడి , మీ మనస్సు కళ్యాణ ప్రదమైన విషయాలపై ఆసక్తి కలిగి ఉంది . అందుకే నేను మీకు శివ పురాణము చెపుతాను . శివ పురాణము వింటే పాపాలు నశించి పోతాయి . మానవుడు పవిత్రుడు,
ఔతాడు శివుని ప్రేమ మయ ,దయామయ కళ్యాణ గుణాల పై ప్రేమ కలిగి శివ భక్తీ కలుగుతుంది . ఈ కథను సాక్షాత్ శివుడే ప్రవచనము చేసారు . తరువాత సనత్కుమార ముని వ్యాసులవారికి చెపితే వ్యాసులవారు ,ఈ పురాణాన్ని రచించారు . ఈ పురాణము  విన్నను  చదివినను ,సుఖ సంతోషాల సమృద్ధి కలిగి శివ సాయుజ్యము కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి .


ఈ పురాణము లో 24 వేల శ్లోకాలు ఉన్నాయి . ,ఏడు సంహితలు ఉన్నాయి .
ఓం శివాయ నమః


రెండవ అధ్యాయము .. . ,దేవరాజు అనే బ్రాహ్మణునికి శివ లోక ప్రాప్తి


అనగనగా దేవరాజు అనే బ్రాహ్మణుడు ఉండే వాడు . అతను రసాలు అమ్ముకొని పొట్ట నింపుకునే వాడు . మెల్ల మెల్లగా వైదిక ధర్మాలు మానుకొని స్నాన్ సంధ్యలు సహితము మాని వేసి ,మెల్ల మెల్లగా మోసాలు చేయ టం మొదలు   పెట్టాడు ధనము పెంచుకో సాగాడు . చెడు స్త్రీల తో సాంగత్యము చేస్తూ అపవిత్రుడైయ్యి ,మహాపాపిగా మారి పోయాడు . ఒక సారి దైవ యోగాముతో ఝూసి అనే ఊరు చేరుకున్నాడు . అది ప్రయాగ దగ్గర ఉంది . అక్కడ ఓ శివాలయము ఉండేది . అక్కడ అతను విశ్రాంతి తీసుకున్నాడు . బాగా జ్వరము వచ్చినందున అక్కడే పడి  ఉందడిపోయాడు  శివాలయము లో శివుని కథలు జరుగుతున్నాయి . శివ లీలలు వింటూ, శివుని ప్రేమను నామామృతాన్ని త్రాగుతూ అదే జ్వరముతో కన్ను మూసాడు  . దైవ యోగము అంటే ఇదేనేమో !


చని పోగానే భీకరమైన యమ కింకరులు వచ్చారు . తీసుక వెళ్ళటానికి రాగానే ,చక్కని భస్మాన్ని ధరించిన శివదూతలు వారితో పోరాడి ,అతన్ని తీసుక వెళ్లి సాక్షాత్ శివునికి అప్పగించారు .


శివ దూతలు అచ్చంగా శివునిలాగానే ఉన్నారు . మెడలో రుద్రాక్షమాలల ధరించి ,,చేతిలో త్రిశూలము ,కాంతులు చిందే , ,  ఉజ్వల రూపము ,జటాధారులు , భయంకరమైన యమకింకరులను పారద్రోలి , సున్దరమై న శివ భక్తులు ,దయతో అతనిని శివుని చెంత చేర్చిన ,ఈతని భాగ్యమె భాగ్యము కదా !మృత్యు సమయాన శివుని గాధలు విని ప్రాణాలు వదిలి , పాపా లను పటాపంచలు చేసుకున్న దేవరాజు శివలీలామ్రుతాన్ని త్రాగి ధన్యుడైనాడు .


ఈ కథ వినగానే శౌనక ముని సంతోషించి ,శివ కథామృతం ఏంతో ో మధురముగా ఉన్నది ఇలాంటివి మరిన్ని కథలు చెప్పండి , అని వినయముగా అడిగారు .
ఓం శివాయ నమః .....


మూడవ అధ్యాయము ,
బిందుగ  బ్రాహ్మణుని కథ …
సూత ముని ఇలా పలికారు  నేను మీకు మరో కథ చెపుతాను . మీకు శివుని పట్ల ఉన్న భక్తిని చూసి నాకు చెప్పాలి అన్న కుతూహలము కలుగుచున్నది . మీరు వేద వేత్తలు ,నాకు ఉత్సాహము కలుగుచున్నది .


సముద్రమునకు దగ్గరలో బాశాకల అనే ఒక గ్రామము ఉండేది . అక్కడి ప్రజలు దుచార్ పూరితులు . కుటిల స్వభావులు . మోసాలు చేసే వారు పరస్త్రీ వ్యాహము ఉండేది . అలానే స్త్రీలు కూడా పరమ దురాచారులు . పర పురుషులతో తిరుగుతూ ,వారికి సతీత్వము అంటేనే తెలియదు , , ఐహిక మైన సుఖాలు మాత్రమె శాశ్వతము అనుకోని విచ్చలవిడిగా తిరిగే వారు . వారికి దేవుడు భక్తీ , త్యాగము ,ధర్మమూ అంటేనే తెలియని వారు , ,


ఇదే ఊళ్ళో బిండుగా అనే బ్రాహ్మణుడు ఉండేవాడు . వడిక కర్మలు తెలియని వాడుగ,తమ భార్య దగ్గరికి రాక ఊర్లలో పరస్త్రీలతో తిరిగేవాడు . మహాపాపిగా ఉంటూ కొన్నాళ్ళకు జబ్బు పడి కన్ను మూసాడు ఈయన భార్య చంచుల , పర ఊరినించి వచ్చిన కారణాన ముందు మంచి ఉత్తమము అయిన జీవితమూ గడిపి , కొన్నాళ్ళకు తను అందరిలా మారి పోయింది . భర్తా పోయాక కోడల్లమీద ఇల్లు వదిల ఇష్టము వచ్చినట్టు తిరిగి ఒక రోజుబంధువులతో  , గోకర్ణము అనే క్షేత్రాని వచ్చింది ,అక్కడి తీర్థములో స్నానము చేసి గుడికి వచ్చింది . శివుని దర్శనము చేసుకొని  అక్కడ ,పురాణ కాలాక్షేపము జరుగుతున్నది . అది వింటూ కూర్చుంది , ఆ రోజు కథలో పరపురుషుల వెంటే తిరిగే స్త్రీ కి ఎలాంటి శిక్షలు విదిస్తారో , పూజారి చెపుతున్నాడు . ,ఇట్టి స్త్రీలు నరకయాతనలు అనుభవిస్తారు ,ఇనుప కడీలు వేడి చేసి కామాన్గాలలో పెట్టి హింస పెడుతారు , లుహ పురుషుడి తో సంసర్గము చేయిస్తారు , ఆ జీవులు పడే హింసలు భరించలేక నరకము దద్దరిల్లుతుంది , అని చెప్పగా విని వణికి పోయింది . అందరు వెళ్లి పోయాక తను పూజారి కళ్ళు పట్టుకొని ఏడ్చి తమ సంగతి అంతా చెప్పుకుంది . మీరే నాకు తగిన ఉపాయము చెప్పండి అని బ్రతిమాలు కున్నది . అప్పుడు పూజారి పశ్చాతాపముకన్తె వేరే మార్గము లేదు ,నీవు పశ్చాతాప పాడుచున్నావు కనుక నీ భయము ఏమి లేదు .


ఇదే ఆలయము లో శివుని సేవ చేసి పురాణము వింటూ ఉంది పో అని చెప్పగా గుడి ని శుభ్రము చేస్తూ తీర్థము లో స్నానము చేస్తూ శివ నామము జపిస్తూ , కాలము గడిపుతూ ఉంటున్నది .


నాలగవ అధ్యాయము
శివ నామము రుచికి మరిగిన చంచుల , శివలోక గమనం



ఒక రోజు చంచుల కు  మృత్యువు రానే వచ్చింది . శివుని ధ్యానము లో నే ప్రాణాలు వదిలింది . ఉజ్వల తేజోమయమగు శివ దూతలు వచ్చి విమానము లో ఆమెను శివపురికి తీ సుకవచ్చి పరమేశ్వరుని వద్దకు చెర్చారు. అక్కడ శివుడు తమ సతీ సమేతముగా చిరునవ్వు తో ఆహ్వానించాడు , తమ ఎదుట ఈశ్వరుడు దయార్ద హృదయముతో నుండి , ఉజ్వల కాంతులతో ప్రకాశించే పరమేషుడు , అర్ధ చంద్ర ముకుటము ధరించి నీలమైన కంథము తో శోభిల్లుచు , చేతికి , మేడలో రుద్రాక్షమాలలు వేసుకొని , విశాలమైన ఫా లము పై మూడు కన్నుల శోభ . భస్మ వీభూతి రేఖలు పాల భాగానీ మరింత శోభాయమానము చేస్తూ ,భుజంగా మాలలు ధరించిన శివున్ని , తమ తల్లియగు పార్వతి దేవిని చూస్తూ తమ జన్మ ధాన్యము అయినది అని పొంగి పోయింది . వారినే  చూస్తూ నిలుచున్నా ఆమెను అందరి తల్లియగు పార్వతి దేవి ఆమెను కను సైగ చేసి దగ్గరకు రమ్మని పిలిచింది , చంచుల దేహము కూడా శివపురికి వెళ్ళగానే కాంతిమయము అయ్యి ఆమె కూడా శివునిలా మారింది , మందస్మిత యగు పార్వతీ మాత ను చూసి తమ జన్మ ధాన్యము అయ్యింది అని తలచి ఆనంద పూరితమైన అశ్రులతో తల్లికి ,శి వునికి నమస్కరించి ,ప్రక్కనే నిలబడింది ఆమె జన్మ జన్మల పాపాలు తొలగి పోయాయి . శివ పార్వతుల కరుణా మృ తములో  తడిసి పరిశుద్దురాలయ్యింది . పార్వతి దేవికి సఖిగా ఉండి ఆమెకు   సపర్యలు చేస్తూ హాయిగా ఉన్నది
ఐదవ అధ్యాయము ,- పిశాచ యోని నుండి బిన్దుగ కు విముక్తి


చంచుల అమ్మవారికి సపర్యలు చేస్తు ,సఖిగా ఉన్నది . ఆ తల్లి మందహాసము లో తడిసి పోతూ అమ్మవారి దివ్య సుగంధాన్ని శ్వాసలో నింపుకొని , ఆ తల్లి లేత పాదాల సేవ చేస్తూ , చక్కని సమయాన్ని గడుపుచున్నది , ఆమె సాంగత్య బలమే నెమో !గ త జన్మ లో ఉన్న తమ భర్త యొక్క  క్షే మాన్ని కోరి , ఇలా ఆలోచించ సాగింది ,” నా జన్మ ధన్య ము అయ్యింది కాని నా భర్త ఎ గతి చెందా డో కదా ? పాపమూ , ఎ పుణ్యము చేసుకోలేదు ,”అని దిగులుగా ముఖము పెట్టుకుంది ,
అది చూసి మందస్మిత  అగునట్టి ఆ తల్లి ,”ఏమయ్యింది ? నీవు దిగులుగా ఉన్నావు , చెప్పు నీ మనసులో ఏముంది ? చెప్పు .”అని మృదువుగా అలరించింది , అప్పుడు చంచుల అమ్మవారిని ఇలా ప్రార్థించింది , “అమ్మ , గిరిజా నందిని ,!స్కందమాత! ఉమా !నీవే సకల జీవ రాసుల కు ఉత్తమ గతిని ఇచ్చే దానవు ,నీవే సగుణ బ్రహ్మవు ,నీవే నిర్గుణ బ్రహ్మవు , నీవే ప్రక్రుతి ,నీవే విక్రుటివి . నీవే పరం పరమాత్మవు , నీవే ఈ సకల జగత్తును సృష్టించే దానవు . సృష్టి ,స్తితి పాలనా చేసేది  నీవే , ఈ అన్నిటి వెనకాల ఉన్నదు కూడా   నీవే , అని ప్రార్థన చేసి శాంతముగా నిల్చుంది . అప్పుడు జగన్మాత పార్వతి దేవి , ఏమి కావాలి అడుగు అంది ,   అది విన్న చంచుల,” అమ్మా నా భర్త అమీ అయ్యాడో తెలువదు ,ఆయన ఎలా ఉన్నారు ?ఎక్కడ ఉన్నారు , నేను మాత్రము నీ  చాయ లో హాయిగా ఆనందాన్ని అనుభవిస్తున్నాను . ఆయన క్షేమము కోరుతున్నాను అని చెప్పింది “
అప్పుడు ఆ తల్లి నీ భర్త  వేశ్యా గమనము చేసినందున ,చని పోయాక, నరక యాతనలు అనుభవించి ,
వింధ్య పర్వతము పై పిశాచ యోని లో తిరుగుతున్నాడు . శివ లీలలు వింటే ఈతని పాపాలు తొలగి పోతాయి అని చెప్పింది . మరి తల్లీ నీవే నా భర్తకు శివ పురాణము వినిపించే ఏర్పాటును కలిగించు అని ప్రాధేయ పడింది . అప్పుడు ఆ తల్లి కరుణ ,కటాక్షము వలన ,గంధర్వ  రాజు తుమ్బురును పిలిపించింది .

తుంబురుడు దివ్య గళ ము తో శివలీలు వినిపించి , శివపురాణ మును గానము చేసి అక్కడకు వచ్చిన వారికి ధన్యతను ప్రసాదించాడు . ఈ పిశాచ రూపము కలిగిన బిందుగా తమ పాప శరీరాన్ని తోలిగించుకొని ఉజ్వల రూపము పొంది , శివలోకాన్ని చేరాడు .వీరిద్దరిని శివ పార్వతులు తమ పార్శదు  లుగా నియమించుకున్నారు . ఈ విధముగా ఘోరమైన పాపులకు సహితము శివుడు తమ ప్రభావము చే వారికి పరిశుద్ధిని కలిగించిన , దయా గుణాన్ని చూ పిన శివ పర్వతుల చరణ  సేవ చేస్తూ కాలము గడిపారు . ధన్యులు అయినారు .

No comments:

Post a Comment