Tuesday, 3 September 2013

Bhagavatgita Part I

ఓం పూర్ణ మదః  పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదచ్యతే
     పూర్ణస్య పూర్ణ  మాదాయ, పూర్ణ మేవావశిష్యతే

భగవద్గీత ...  
ఓం శ్రీ పరమాత్మనే నమః
ధృత రాష్ట్ర ఉవాచ ,
ధర్మ క్షేత్రే కురు క్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వ వత సంజయా . !!1!!

ధృతరాష్ట్రుడు ,ఈ విధముగా అడుగు చున్నాడు ,”సంజయా! ధర్మ క్షేత్రము అయినటువంటి కురు క్షేత్రములో ఏమి జరుగుతున్నది , మా పుత్రులు ,మరియు పాండవుల మధ్య ఏమి జరుగుతున్నది యో చెప్పుము “. అని తమ సారథిని అడుగుతున్నాడు . (యుద్ధము జరుగుటకు పూర్వము మహర్షి వేదవ్యాసులవారు ,ద్రుత రాష్ట్రున్ని ,యుద్ధము వీక్షించుట కొరకు దివ్య నేత్రాన్ని ఇస్తానంటాడు ,అప్పుడు ధృత రాష్ట్రుడు ,”నాకు ఈ ఘోరమైన  యుద్ధము  వీక్షించే శక్తి లేదు. “  వినటానికి అనుగ్రహించమని కోరుతాడు   .
అప్పుడు వేదవ్యాసులవారు ధృత రాష్ట్రుని సారథి అయిన” సంజయునికి “దివ్య దృష్టిని ప్రసాదిస్తాడు .
ఈ దివ్య దృష్టి ఉన్నందున సంజయునికి మృత్యువు రా దు , అన్ని సంఘటనలను తిలకించ     గలడు  , జరిగినది జరిగినట్లు చూసి చెప్ప గలడు . ఈ శక్తి వలన ,భౌతికముగా ,మానసికముగా అన్ని మాటలు వినే శక్తి ఉంటుంది ఎట్టి  విషయము దాగదు అన్నిటి ని తెలుసుకో గలడు . ఇతనికి అలుపు ఉండదు . ) ఇంతటి మహోన్నతమైన వరము  ఇచ్చి    వ్యాసుల వారు ,
“వినాశాన్ని ఎవరు తప్పించలేరు , ధర్మము వర్ధిల్లుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు . “
ఆయన వెళ్ళిన తరువాత ధృత రాష్ట్రుడు అడిగిన కొద్ది సంజయుడు మొత్తము సృష్టిని
చూసి వర్ణించుట మొదలు పెట్టాడు . భారత దేశ వర్ణన , మిగితా ద్వీపాల వర్ణన ను కూడా  ప్రసంగించాడు .

సంజయౌ వాచా ,
దృష్ట్వా తూ పాండవా నీకం ,వ్యూ ఢమ్  దుర్యోధనస్తదా
ఆచార్యా ముప సంగమ్యా రాజా వచన మబ్రవీత్ !!2!!

సంజయుడు ఇలా పలుకుతున్నాడు ,
పాండవుల వ్యూహ రచన ను నిరీక్షించి ,దుర్యోధనుడు , ద్రోణాచార్యుల  వద్దకు వెళ్లి ఇలా అంటున్నాడు , ...

పశ్యైయ్ తాం పాండు పుత్రాణాం ఆచార్య మహతీ చమూమ్
వ్యూఢామ్ ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతాం !!3!!
దుర్యోధనుడు రాజనీతి పరుడు ,సమస్త కార్యాలు అతనే చూసేది . సజ్జనులు అందరిని గౌరవ ప్రదముగా సంబోధిస్తారు . సంజయుడు ద్రుత రాష్ట్రుని ముందు ,అతని కుమారున్ని రాజు అని సంబోధించి సంతోష పరిచాడు .
యుద్ధ భూమి లో పాండవ సేన వ్యూహాన్ని తిలకించిన తరువాత ,దుర్యోధనునికి  ఆశ్చర్యముకలిగి   ,ద్రోణాచార్యుల  వద్దకు వెళ్లి “మీ యొక్క బుద్ధిమంత శిష్యుడు ,ద్రుపద మహారాజు పుత్రుడు అయినట్టి  ,
దృష్ట  ద్యుముడు ,చాల చక్కటి ప్రతిభను వ్యూహ రచనలో కనబరిచాడు చూడండి అని చెప్పి ,లోపల తను అంత కంటే ఇంకా గొప్పగా తమ సైన్యము ఉండాలి అన్న కాంక్షతో ,తమ సేనాధిపతి అయిన ద్రోనాచార్యులతో ,సంభాషించచాడు  ,భీష్మ పితమహున్ని వద్దకు వెళుతాడు .

అత్ర శూరా మహేశ్వాసా ,భీమార్జున సమాయుధి ,
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః        !!4!!
ద్రుష్ట కేతుశ్చే కితానః ,కాశీ రాజశ్చ వీర్యవాన్    ,
పురుజిత్  కుంతీ భోజశ్చ శ్యైభ్యశ్చ నరపుంగవః      !!5!!
యుధా మన్యుష్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ,
సుభద్రో ద్రుపదేయాశ్చ సర్వ ఏవం మహారథాః        !!6!!

ఈ  శ్లోకము లో  భీమునికి ,అర్జునునికి సమ ఉజ్జిలుగా ఉన్న వారిని పేర్కొన్నారు . సాత్యకి , విరాట రాజు , ద్రుపద మహారాజు , దృష్ట  కేతు ,చేకితాన్, కాశి రాజు పురుజిత్ ,కుంతీ భోజ, శైబ్యుడు ,యుధామన్యు , ఉత్తముజుడు మొదలగు వారు  యుద్ధ రంగములో మంచి దిట్టలు .

సాత్యకి :,కి మరో పేరు యుదామన్యుడు  . ఈయన అర్జునుని శిష్యుడు .
(విరాట రాజు ,కొలువు లో పాండవులు ఒక సంవత్సరము గుప్త వనవాసము చేసారు . వీరి కుమార్తె   ఉత్తర  ను అభిమాన్యునికి ఇచ్చి వివాహము చేసారు , వీరు ఈ యుద్ధములోనే తమ ముగ్గురు పుత్రులతో సహా మరణించారు . . )

ద్రుపద మహారాజు,-: పాంచాల దేశ రాజు ,అయినట్టి పృశతుని  కుమారుడు .  భరద్వాజ ముని కి రాజు పృష తునికి  మధ్య మంచి మైత్రి ఉండేది . భరద్వాజుని పుత్రుడు ,ద్రోణుడు .  ప్రుశాతుని పుత్రుడు ద్రుపదుడు , ద్రుపదుడు  ద్రోణుడు కూడా , బాల మిత్రులు ఇద్దరు కలిసి ఆశ్రములో ఆడుకొనే వారు . ప్రుశ తుని  మృత్యు అనంతరము , అతని కుమారుడు దృపదుడు  రాజు అయ్యాడు . పెద్ద అయ్యాక ఒక సారి ద్రోణుడు ద్రుపడుని  వద్దకు వెళ్లి మిత్రమా !  అని పలుకరించాడు . తనను, నిరు పేద అయిన ద్రోణుడు సభలో “మిత్రమా” అను ట  అతనికి రుచించలేదు . మిత్రునిగా పిలవటం ఇష్ట పడనందునదున ,ద్రోనునికి అవమానముగా  తోచి ,”నిన్ను యుద్ధము లో ఓడిస్తాను’ అని సంకల్పము తీసుకుంటాడు .

ద్రోణుడు -,కౌరవులకు పాండవులకు యుద్ధ విద్యలు నేర్పి ,అర్జునున్ని గురు దక్షిణగా ద్రుపదుణ్ణి బంధించి తీసుక రామ్మని అడుగుతాడు , అప్పుడు అర్జునుడు ద్రుపదుణ్ణి బంధించి తమ గురువు ద్రోణా చార్యుల ఎదుట నిలబెడు తాడు . ద్రోణుడు సగము రాజ్యము లాక్కొని
ద్రుపడుడిని విడిచి పెట్టాడు . ద్రుపదుడు ద్రోణా చార్యులను     నామమాత్రముగ   మిత్రుడిగా ఒప్పుకున్నాడు . కాని మనసులో  ద్వేషము ఉన్నందున ,యాగము చేసి ద్రోణుని చంప  గలిగే పుత్రుడిని కోరుకుంటాడు . యాగ కుండము నుండి “దృష్ఠ  ద్యుముడు “, మరియు “ద్రౌపది “ఇద్దరు లభించారు . . ద్రౌపది ని పాండవులు స్వయంవరము లో గెలిచి వివాహము చేసుకో గ,మహాభారత యుద్ధములో ,పాండవుల పక్షాన ద్రుపదుడు మరియు ద్రుష్టద్యుముడు కౌరవ సైన్యముతో పోరాటము
చేసారు. ,ద్రోణుని చేతిలో ద్రుపదుడు చని పోయాడు .

శైయ్భైయ్శచ నర పుంగవ ….
శ్యైయ్బ్యుడు ధర్మ రాజు యుదిష్టురుని కి  పిల్ల ను ఇచ్చిన మామ ,”దేవిక” ఈ తని కుమార్తె .  తో వివాహము అయ్యింది ఇయన మనుష్యులలో శ్రేష్టుడు  . అన్న బిరుదు గడించాడు .” నరపున్గవ “(శైయబ్యుడు )
చేకితాన్ … వృష్ణి వంశమందు యాదవుడు ,పాండవ సైన్యములోని ఏడుగురు సేనాపతులలో ని ఒక్కడు . ఇదే యుద్ధములో దుర్యోధనుని చేతిలో చనిపోయాడు. ఇతను  గొప్ప శూరుడు .

ద్రుష్ట కేతు ...ఈయన  శిశుపాలుని పుత్రుడు ,  ద్రోణుని చేతిలో మరణించాడు .

కాశి రాజు ….
ఈయన చాల గొప్ప శూరుడు . ఇతని గురించి , కర్ణ పర్వములో ,అభి భూ ,క్రొద్ హంత మొదలగు పేర్లు గా చెప్పటము జరిగింది . ఇతను శూరుడే .

పురుజిత్ మరియు కుంతీ భోజుడు ,వీరు కుంతికి అన్నలు

యుధామన్యు ,ఉత్తముజుడు  వీరిద్దరిని ఆశ్వత్తమ ,నిద్రలో ఉండగా చంపాడు . కాలము రాగానే దేహము విడిచి పరమాత్మ లో లీనమైయ్యారు .

అభిమన్యుడు అర్జునుని కుమారుడు ,ద్రోణుడు రచించిన చక్ర వ్యుహములొ వీరుడి గా ప్రవేశించి ప్రచండ యుద్ధము చేసి ,పోరాడగా ,ద్రోణుడు ఆశ్వత్థామ , కర్ణుడు , కృపాచార్యులు బృహద్దలుడు , కృతవర్మ ,మోసము చేసి అభిమాన్యుని చంపారు . పరిక్షితుడు ఇతని కుమారుడు . అంతటి ఘోర సమయములో సహితము అభిమన్యుడు వీరోఛి తమైన సంగ్రామము చేసి కీర్తి గాంచాడు .

********

ద్రౌపది కి కలిగిన ఐదుగురు పుత్రులను అశ్వత్థామ నిద్రలో ఉండగా చంపాడు . వీరందరూ మహారథులు
ద్రోణాచార్యులు  భరత్ ద్వాజ  ముని పుత్రులు ,వీరు అగ్ని వేశ్య మహర్షి , మరియు పరషు రాముని నుండి సమస్త శాస్త్ర విద్యలి నేర్చిన దురందురుడు . వేద వేదాంగాలు  తెలిసిన మహనీయుడు .

అస్మాకం తు విశిష్టా యే  తాన్ని   బోధ ద్విజోత్తమా ,
నాయకా మమ సైన్యస్య  సంఘ్యార్థం తాన్ బ్రవీమి తే !!7!!

ద్రోణా చార్యులను దుర్యోధనుడు ,ద్విజోత్తమా అని సంబోధిస్తూ మన సైన్యములో ని వారు కూడా శూరులు ధీరులు ఉన్నారు . వారి పేర్లను నేను ఇప్పుడు చెపుతాను ,

భ వాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయా ,
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్త థైవ చ            !!8!!

ద్రోణాచార్యులు అగ్ని వేశ్యుని నుండి ి ,మరియు పరశు రాముని నుండి సమస్త శస్త్ర రహస్యాలు నేర్చు కున్నారు . ద్రోణాచార్యులు వేద వేదాంగాలను శస్త్ర విద్యలను ,విద్యలలోని మర్మాలను సూక్ష్మముగా గ్రహించిన వారు , తపసం పన్నులు
ధనుర్వేద పారంగతులు యుద్ధ కళలలో నిపుణులు ,ఈయన శక్తికి అంతు     లేదు వీరు ఏకాగ్రతగా వేసే అస్త్రాలకు తిరుగు లేదు , వీరిని ఎంత పొగిడినా తక్కువే . శూరద్వాన మహర్షి పుత్రిక కృపి తో ఈయనకు వివాహము జరిగింది , అశ్వత్థామ వీరికి కలిగిన పుత్రుడు .

భీష్మ పితామహులు ... వీరు రాజు శంతను, భగీరథి గంగ కు కలిగిన కుమారుడు . తమ తండ్రి సత్యవతికి మనసు ఇచ్చినందున ,సత్యవతిని తమకు తల్లిగా తెచ్చుకోవటానికి ,భీష్మ ప్రతిఘ్య చేస్తాడు , తను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని ,తను బ్రతికినన్నాళ్లు సత్యవతి కొడుకులకు ,
సింహాసనము పైనున్న రాజుకు త్రికరణ శుద్ధిగా సేవ చేస్తానని . అదే మాటకు కట్టు బడి ఉన్నందున నే దుర్యోధనుడి దురాచారాలను ఆపలేక పోయాడు , ఈయన కృష్ణ పరమాత్ముని  భక్తుడు . ప్రచండ మైన యుద్ధ కళా నిపుణులు . ఈయన కు తండ్రి శంతను ,
ఇచ్చా మరణము , వరము ఇచ్చాడు ఈయన  కు  “ఇచ్చామరణము ,” స్వతః కోరిక ఉంటేనే    మరణము సంభవిస్తుంది అని .
యుద్ధము లో పాండవులను చం ప ను, కాని ప్రతినిత్యము పది వేల యోదు  లను చంపుతాను అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు . వీరు మహనీయులు వీరిలో క్షమా దయా , త్యాగము , సంతోషము , తితిక్ష , ముముక్షత్వము , శాంతి , సహనము తేజము బలము , సత్యము న్యా యము స్పష్ట ముగ నుండుట నమ్రత , దీక్ష పారాయణము అన్ని సుగుణాలు కలిగిన మహానుభావులు . పది రోజులు సేనాధిపత్యము వహించి ,ఆంప శైయ్యపై ఉండి ఉత్తరాయణ కాలము లో మరణించాడు .

కర్ణుడు మంత్రం బలముతో ,కుంతికి కలిగిన సూర్య పుత్రుడు ,పెండ్లి కానందున భయపడి నీటిలో విడిచి పెట్టిన కుమారుడు , కవచ కుండనాలతో సాక్షాత్ సూర్యుని ల వెలిగే ఈ కుమారుడు ఎన్నో అవమానాలు భరించి , ఉన్న ఇతనిని దుర్యోధనుడు మిత్రుడి గా చేర దీసాడు . అందుకు కృత ఘ్య త గా దుర్యోధనుడి పక్షాన యుద్ధము చేసి ,తమ్ముడు అర్జునుని చేతిలో ప్రాణము వదిలాడు . అధర్మ పక్షాన ఉన్నందున , కృష్ణ పరమాత్ముడు ,ఇతని ఓటమికి ఇంద్రుని సహాయము తో కవచ్ కుండనాలు తీసుకొని మృత్యువుకు దారి ఏర్పరిచాడు . కర్ణుడు ఘతోత్ క చ్చున్ని చంపి మిత్రుడు దుర్యోధనునికి  సహాయము చేసాడు .

క్రుపాచార్యు,లు ;వీరు గౌతమ వంశీయులైన శరద్వాన్ మహర్షి పుత్రులు . ధనుర్విద్యా పారంగతులు ,రాజు శంతను ఇయనను చాల దయతో పెంచారు అందుకు ఈయన పేరు కృప మరియు వీరి చెల్లెలి పేరు కృపి అని పెట్టారు . ద్రోనునికి పూర్వము ఈయన కౌరవులకు ,పాండవులకు ధనుర్విద్య నేర్పిన గురువు ,

వికర్ణుడు : ఈయన  కౌ రవుల వంద మంది పుత్రులలో ఒక్కడు , ధర్మ మార్గములో నడుచువాడు ద్రౌ పది వస్త్రాపహరణము చేసే నపుడు ద్రౌపది సభలో అందరి సమక్షములో ఒక ప్రశ్న వేస్తుంది ,నన్ను పాండవులు ఓడారా  ?అని అడగగా విదురుడు తప్ప అందరు మౌనముగా ఉన్నారు . ఒక్క వికర్ణుడు మాత్రము మేము నిన్ను గెలువ లేదు అని ధైర్యముగా చెపుతాడు .( మహా సభా పర్వము )

ఇంత వరకు ప్రసంగించిన కౌరవ యోదుల  గురించి  ప్రస్తావనఈ పై నున్న శ్లోకము లో  మనకు లభ్యం ఔతున్ది .
విఅన్యే చ బాహవః శూరా మదర్థె వ్యక్త జీవితాః ,
నానా శ స్త్ర ప్రహరణాహా సర్వే  యుద్ధ విశారదాః . (9)

తమ సైన్యాన్ని చూసి  ద్రుత రాష్ట్రుడు ఇలా అంటున్నాడు ,  అస్త్ర శస్త్రాలు ధరించి నిల్చున్న యోదులంతా నా కోసము తమ ప్రాణాలు అర్పించి త్యాగము చేసే వారే.  వీరు చచ్చే వారకు పాండవులతో పోరాటము జరుపుతారు .  !
భీష్మ పితామహులవారు అన్ని విధాల మన సైన్యాన్ని రక్షించగలరు ఈ విధముగా మనము అన్ని విధాల సురక్షితముగా ఉన్నాము .
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మా భిరక్షితం ,
పర్యాప్తం త్విద మే తేషాం బలం భీమాభిరక్షితమ్ (10)

భీముని వ్యూహం కంటే , భీష్ముని వ్యూహ రచన  ఎక్కువ పటిష్టముగా ఉన్నది . అని సంతృప్తి కనబరిచి -

అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా :
భీష్మ మేవాభి రక్షంతు భవన్తః సర్వం ఎవ హి (11)

దుర్యోధనుడు భీష్మ పితాహుని అన్ని వై పుల రక్ష  చేయమని బాధ్యత ను అందరికి అప్పగిస్తూ వస్తున్నాడు .
తస్య సంజంయన్ హర్షం కురు వృద్ధ పితామః
సింహ నాదం వినద్యోచ్చై:శంఖం  దధ్మౌ ప్రతా పవాన్ (12)
తతః శంఖాశ్చ బెర్యశ్చ పణవాన్ క గో ముఖః  ,        
సహసైవాభ్య హన్యంత శబ్దస్తుమూలో భవత్   .        ( 13)  
భీష్మపితామహులు సైన్యము లో ఉత్సాహము కొరకు శంఖాన్ని పూరించగానే డోలు మృదంగాలు అన్ని ఒక్కసారిగా మ్రోగాయి .  ఆ ధ్వని చాలా భీకరముగా ఉండింది
యుద్ధ ఆరం భము సంకేతము అందుకోగానే అందరిలో యుద్ధము చేయాలి అన్న ఉత్సాహము పొంగింది .  ఆ ధ్వని ఆకాశాన్ని అంటి ప్రతిధ్వనిని వినిపింప చేసింది .

సంజయుడు  యుద్ధ భూమి వివరాలు ,చెపుతూ పోతుంటే ,మధ్యలో ధృతరాష్ట్రుడు పాండవ సైన్యములో ఏమి జరుగుతున్నదో చెప్పమంటాడు .
***************

తతః శ్వేత హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ
మాధవ పాణ్డవాశ్చైవ దివ్యౌ శంఖౌ  ప్రదద్మతు: (14)

పితామహుని  శంఖ నాదము చే దుర్యోధనునికి ఉత్సాహము కలిగింది  .

తెల్లని ఆశ్వాలతో కూడిన అందమైన రథము లో ఉత్తమ మైనా గుర్రాలతో ఉన్న రథము పై కృష్ణుడు సారథిగాఉండగ అర్జునుడు రథము పై కూర్చున్నాడు . అర్జునుడు కూడా అలౌకికమైన  శంఖాన్ని పూరించాడు . అర్జునుని రథము ఉత్తమమైనది ,  విశాలమైనది .
బంగారు పూ త కలిగి ఉంది  . తేజోమయముగా వెలుగొందుతున్నది . దాని పైన ఎన్నో పతా     కాలు   ఎగురుతున్నాయి . వాటికి మువ్వలు కట్టి చాలా అందముగా అలంకరించి ఉంది . ఈ పతాకాల పైన హనుమంతుని ధ్వజము ఎగురుతున్నది . ఖాండవ వనాన్ని దహించిన తరువాత అగ్ని దేవుడు అర్జునునికి బహుకరించిన రథము ఇది . అందున శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈతనకు సారథి . మరేమీ ?

పాంచ జన్యం హృషి కేశో దేవా దత్తం ధనంజయ ,
పౌన్ డ్రం  దధ్మౌ మహా శంఖం భీమ కర్మా వృకోదర (15)

కృష్ణ పరమాత్ముడు పాంచ జన్యాన్ని , అర్జునుడు దేవా దత్త అను శంఖాన్ని పూరించగా
భీముడు పౌన్ద్రము  అను శంఖాన్ని పూరించాడు .భీముని శంఖము చాల బరువుగా ఉంటుందట అందుకే మహా శంఖము అన్నారు .

అనంత విజయం రాజా  కుంతీ పుత్రో యుధిశ్థిర:
నకుల సహదేవశ్చ సుఘోష్ మణి పుశ్పకౌ (16)

పాండవులలో యుధిష్టి రుడు , అర్జునుడు ,మరియు భీముడు , కుంతీ పుత్రులు నకుల సహదేవులు మాద్రి పుత్రులు . వారి వారి తల్లుల పేర్లు ప్రస్తావించి సంజయుడు గౌరవము చూపించాడు .  యుధిశ్ఠి రుని రాజుగా సంబోధించాడు ఎందుకనగా యుదిశ్తిరుడు , రాజసూయ యాగము చేసి మిగితా రాజులందరిని గెలిచాడు . భావి చక్రవర్తి అన్న నమ్మకము సంజయునికి ఉండేది . యుదిశ్తిరుని శంఖము పేరు అనంత విజయ , నకుల సహదేవులు  సుఘోష్ , మనిపుష్పక శంఖాన్ని పూరించగా ,...

కాశ్యశ్చ పరమేశ్వాస్:శిఖండి చ మహారథ:
ద్రుష్టద్యుమ్నో విరాట శ్చ్ సాత్యకిశ్చా పరాజిత:(17)
దృ పదో ద్రౌ పదేయాశ్చ్ సర్వశ్:ప్రుథ్వీపతే
సౌభద్రశ్చ్ మహాబాహు :శంఖాన్దధ్ము పృథక్ పృథక్ (18)

ఈ శ్లోకములో కాశీ రాజు , శిఖండి , సాత్యకి విరాటుడు దృ పద  మహారాజు ద్రౌపది అయిదు గురు పుత్రులు పెద్ద భుజాలు కలిగినట్టి అర్జున్ పుత్రుడు అభిమన్యు ,వీరందరూ ఉత్సాహముగా తమ తమ శాఖాన్ని పూరించారు .

శిఖండి మరియు ద్రుష్ట ద్యుముడు ద్రుపద మహారాజు కొడుకు లు  శిఖండి పెద్దవాడు ద్రుష్టద్యుముడు అగ్ని కుండము నుండి జన్మించిన పుత్రుడు . చాల సమయం వరకు ద్రుపడునికి సంతానము లేకుండే . శివుడైనట్టి ఆశుతోషుని తపస్సు చేయగా పుత్రిక జన్మిస్తుందని వరము ప్రసాదించగా  , నాకు పుత్రుడు కావాలి అని అడిగాడు . అప్పుడు శివుడు  , ఈ పుత్రిక కొంత సమయము తరువాత పుత్రుడిగా మారుతుంది . అని చెప్పాడు శివుని అభయము పై నున్న విశ్వాసము కారణమునా ,పుట్టినప్పటి నుండే పుత్రుడు అని ప్రచారము చేసి, దాసీ వాళ్లకు సహితము తెలియ కుండా పెంచారు .

దృ పదో ద్రౌ పదేయాశ్చ్ సర్వశ్:ప్రుథ్వీపతే
సౌభద్రశ్చ్ మహాబాహు :శంఖాన్దధ్ము పృథక్ పృథక్ (18)

ఈ శ్లోకములో కాశీ రాజు , శిఖండి , సాత్యకి విరాటుడు దృ పద  మహారాజు ద్రౌపది అయిదు గురు పుత్రులు పెద్ద భుజాలు కలిగినట్టి అర్జున్ పుత్రుడు అభిమన్యు ,వీరందరూ ఉత్సాహముగా తమ తమ శాఖాన్ని పూరించారు .

శిఖండి మరియు ద్రుష్ట ద్యుముడు ద్రుపద మహారాజు కొడుకు . శిఖండి పెద్దవాడు ద్రుష్టద్యుముడు అగ్ని కుండము నుండి జన్మించిన పుత్రుడు . చాల సమయం వరకు ద్రుపడునికి సంతానము లేకుండే . శివుడైనట్టి ఆశుతోషుని తపస్సు చేయగా పుత్రిక జన్మిస్తుందని వరము ప్రసాదిస్తే , నాకు పుత్రుడు కావాలి అని అడిగాడు . అప్పుడు శివుడు చెప్పాడు ,  ఏమిటి అంటే ఈ పుత్రిక కొంత సమయము తరువాత పుత్రుడిగా మారుతుంది . అని చెప్పాడు శివుని అభయము పై నున్న విశ్వాసము కారణమునా ,పుట్టినప్పటి నుండే పుత్రుడు అని ప్రచారము చేసి, దాసీ వాళ్లకు సహితము తెలియ కుండా పెంచారు .

కొంత కాలానికి హిరణ్య వర్మ అనే రాజు కుమార్తె తో వివాహము కూడా చేయవలసి వచ్చింది .కాని పెండ్లి తరువాత ఆ కన్య దాసీ వారిచే హిరణ్య వర్మ  కు తెలిపింది దానితో ఆయన యుద్ధము ప్రకటించారు . ఇది చూసిన శిఖండి బాధతో పారి పోయాడు .దారిలొ శ్తూనాకర్ణ అనే పాండవ సైన్యము లోని శూరులంతా ఒక్క సారిగా శంఖ నినాదము చెయ్యగానే పృథ్వీ ఆకాశము దద్దరిల్లింది .
యక్షుని తో పరిచయము అయ్యి ,ఆయన కు శిఖండి పై దయ కలిగి కొన్నాళ్ళ కొరకు నా పురుశాత్వము నీకు ఇస్తాను అని తమ పురుశాత్వము శిఖండికి ఇచ్చి స్త్రీత్వము తను తీసుకుంటాడు . కొంత సమయానికి కుబేరుడు ఈ యక్షునికి శాపము ఇచ్చాడు నీవు స్త్రీగానే ఉండిపో అని . దానితో శిఖండి తమ మామకు జరిగిన వివరములు తెల్పి తన భార్యను ఇంటికి తెచ్చుకొని మామను శాంత పరిచాడు .
ఈ విధముగా ద్రుపడునికి శివుడు ఇచ్చిన వారము నెరవేరింది



భీష్మునికి ఈ విషయము అంతా  ఇదివరకే తెలుసు . యుద్ధములో స్త్రీ పై తను అస్త్రము వెయ్యడు . శిఖండి గొప్ప శూరుడు , యుద్ధము లో అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని భీష్ముని పై బాణాల వర్షము కురిపించి , భీష్మున్ని అమ్పశైయ్య పాలు చేస్తాడు .

స ఘోషో ధార్త రాష్ట్రానాం హృదయాని వ్యదారయత్
నభశ్చ పృథివీం చైత్ర తుములో వ్యనునాదయన్      (19)

“పాండవ పక్షాల శంఖ్ నినాదాలు మీ పక్షపు వారిని భయ కంపితులను చేసాయి (మీ )అన్న
పదం వాడి ద్రుత రాష్ట్ర ,దుర్యోధన” కౌరవ సైన్యం”, అన్న అర్థానికి వాడారు . సంజయుడు చూస్తున్నది చెపుతున్నాడు , సపూర్ణ యుద్ధరంగాన్ని వీక్షించ సాగాడు .

అథ వ్యవస్థితాన్ దృ ష్ట్వా ,ధార్త రాష్ట్రాన్ కపిధ్వజా :
ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవా : (20)
హృషీ కేశం తదా వాక్య మిద మాహ మహీపతే
     అర్జున ఉవాచ ,
సెనయో రుభాయోర్మధ్యే రథం స్థాపయ మే చ్యుతా(21)

ఓ రాజా, ఆంజనేయ స్వామి ని తన ధ్వజము పైన , ఉంచుకున్నట్టి అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్ముణ్ణి , “హృషీకేశా “అని సంబోధిస్తూ , నా రథాన్ని ,సేన మధ్య కి తీసుక వెళ్ళు .
అచ్చ్యుతా !”అని అంతున్నాడు . . ఇక్కడ అర్జునుడు కృష్ణ పరమాత్ముణ్ణి  ,” హృషీ కే షా “అంటే ఇంద్రియాలకు స్వామి , అని  సంబోదిస్తున్నాడు . ఇక సంజ యు డే మొ , రాజా , అర్జునుని సారథి ఏమో లోకానన్ని  ఏలేటి స్వామి కృష్ణ పరమాత్ముడు .” అతని తో యుద్ధము చేసి గెలుపును ఆశించే మీ అఘ్యానమును , ఏమనాలి .”అన్నట్టు ధ్వనింప చేసాడు .
అర్జునుడు తమ రథాన్ని సేన మధ్యలో కి తీసుక వెళ్ళమని .  అక్కడి నుండి సేన ను వీక్షించి నిర్ణయాలు తీసుకోవచ్చు అన్న అభిప్రాయము తో అన్నాడు .

యావదేత్తాన్ నిరీక్షేహం యోద్దుకామానవస్తితాన్ ,
కైర్మయా సహ యోద్దు వ్యమస్మిన్ రణ సముద్య మే  (22)

యోత్సమానన వేక్షే ..  హం య ఏతేత్ర  సమాగతా :
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధె :  యుద్దే    ప్రియ చికీర్శవ:      (23)

“దుర్బుద్ధి కలిగినట్టి దుర్యోధనునికి , సాహాయము చేయుటకు వచ్చిన వారిని చూసి ఎవరెవరిని హత మార్చాలో నిర్ణయం తీసుకోవాలి . వీరంతా దుర్మాగులే . వీరి పని కాస్తా పట్టాలి “. అని అర్జునుడు అంటున్నాడు .
సంజయ ఉవాచ .
ఎవ ముక్తొ హృషీ కేషో గుడా కేషేన భారత
సేనయోర్ ఉభయో మధ్యే స్థాపయిత్వా రథొ త్తమా (24)
భీష్మ ద్రోణ శ్చ కర్ణ శ్చ సర్వేషాం చ మహీక్షితామ్
ఉవాచపార్థ పశ్యైయ్ తాన్ సమవేతాన్ కురూనితి (25)

కృష్ణ పరమాత్ముడు వెంటనే రథాన్ని రణ  రంగానికి మధ్యలో కి తీసుక వెళ్ళాడు . భీష్మ ద్రోణులు మరియు రాజుల సమక్షానికి తీసుక వెళ్ళాడు . కృష్ణున్ని  రథొ త్తమా అని సంబోధించి కృష్ణుని గొప్ప సారథి అన్న అర్థానికి ఈ పదం వాడటం జరిగింది  .”గుడా కేశా,  “అని ,నిద్రను జయించిన వాడా ! “ అని అర్జునున్ని, సంజయుడు సంబోధించి చెపుతున్నాడు అర్జునుడు నిద్ర పోకుండా ఉండగలడు  . అటువంటి వాన్ని మీ పుత్రులు ఎలా గెలవ గలరు ? అన్న భావన తో సంజయుడు యుద్ధాన్ని వివరిస్తున్నాడు .

కృష్ణ పరమాత్ముడు అర్జునుణ్ణి  హెచ్చరిస్తూ వీరే మీ కుల జనులు.  ఎంత సేపు వీరిని నిరీక్షిస్తావో నీ ఇష్టం . కావాలనే అలా అన్నాడు.  దానితో అతని హృదయం లో దాగిన బంధు ప్రేమ గురువుల ప్రేమ తాత పై నున్న ప్రేమ ఒక్క సారిగా మేల్కొని అతని హృదయం
నిండా కరుణ  నిండి పోయి ,మోహము ఆవహించి కృష్ణా నేను వీరి తో యుద్ధము చేయ లేను . అని అంటాడు .

అర్జునుణ్ణి నిమిత్తము చేసి కృష్ణ పరమాత్ముడు గీత సందేశము ఇవ్వ దలిచారో ఏమో !
నేను యుద్ధము చేయను  గాక చేయను  .  అని అర్జునుడు రథము దిగి నిల్చుంటడి పోయాడు .

తత్రా పశ్యస్థితాన్ పార్థ :పిత్రునథ పితా మహాన్ ,
ఆచార్యాన్ మాతులాన్ భ్రాత్రున్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్  స్థ థా (26)

అర్జునుడు రెండు సేనలను చూడగానే ,తాతలు ,పిన తండ్రులు , మామలు ,పుత్రులు గురువులు , ముని మనుమలు ,మనుమలు ,ముని మనుమల స్నేహితులు ,పిల్లను ఇచ్చిన మామలు , శ్రేయోభిలాషులు తమ ప్రాణాలను పణ ము గా పెట్టుటకు సిద్ధముగా ఉన్నారు .

శ్వశురాన్  సుహ్రుదశ్చైవ     సేనయోరుభయోరపి  ,
తాన్ సమీక్ష్య స కౌన్తెయ సర్వాన్ బందూర్వస్తితాన్                (27)

ఇంత  మంది శ్రేయోభిలాషులలు తమ వైపున యుద్ధము కొరకు నిల్చొని ఉండుట చూడగానే అర్జునునికి దుక్ఖము పొర్లి  వచ్చింది .

కృపయా పరయా విష్టో విశీదన్నిదమబ్రవీత్ ,

అర్జునుడు వీరందరినీ చూడగానే ఆలోచించ సాగాడు . యుద్ధము లో వీరంతా నిష్కారణముగా ప్రాణాలు కోల్పోతారు .” పరయా ,కృపయా .”అర్జునుడు తను క్షత్రీయుడు అన్న విషయం మరచి పోయాడు , ఆ సమయాన అతనిని మోహము ఆవహించింది .

అర్జునౌ వాచ,
దృష్ట్వేమం స్వజనం కృష్ణా యుయుత్సుమ్ సముపస్థితం ,     (28)
సీదన్తి మామ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి .                   
వేపథుశ్చ శరీరే మే రోమ వ్హర్శశ్చ్ జాయతే                         (29)    
.
గాండీవం   స్త్రం సతే హస్తా త్వక్చైవ పరిదహ్యతే                   
న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మన:                     (30)



నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ
నచ శ్రేయో నుపశ్యామి హత్వా స్వజనమాహవే ,                   (31)

అర్జునుడు ఇలా అంటున్నాడు , ‘కృష్ణా వీరిని చూసి నా నోరు ఎండి  పోతున్నది . నా సమస్త అవయవాలు శిథిలము అయ్యాయి , నా శరీరము వణికి పోతున్నది.  నా గాండీవము జారి పోతున్నది . పట్టు నిలవట లేదు . వీరు మా కొరకు యుద్ధము చేసి అనవసరముగా మృత్యువు వాత పడుతున్నారు . నా చర్మము మండి  పోతున్నది . నాకు ఏదో భ్రమ కలుగుతున్నది . నేను నిల్చోలేక పోతున్నాను .
ఈ యుద్ధము లో,  ఇంత  మంది చావు చూసి నేను  విజయాన్ని ఆనందించ లేను .

న కాంక్షే విజయం కృష్ణా న చ రాజ్యం సుఖాని చ ,
కిం నో రాజ్యేన గోవిందా కిం భోగైర్జీవితేన వా          (32)

కృష్ణా ఈ విజయం నాకు వద్దు . ఈ రాజ్యము వద్దు . ఈటు   వంటి భోగము నాకెందుకు  గోవిందా !

యేశామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని,
త ఇమేవ స్థితా యుద్ధే ప్రాణాం స్త్యక్త్వా ధనానిచ     (33)

కృష్ణా ఎవరికొరకు మేము యుద్ధము చేసి గెలుపు పొందాలి అని ఆకాంక్షిస్తున్నామో , వారే ప్రాణాలను సహితము లెక్క చేయడలచలేదు . వీరంతా మరణిస్తే ఈ రాజ్యము ఎవరికీ భోగము ఎవరికీ . ఎట్టి  పక్షము లో నాకు యుద్ధము చేసేది లేదు .
ఆచార్యా , పితర:,పుత్రాస్తథైవ చ పితామహా:,
మాతులా:శ్వశురా: పౌత్ర :,శ్యాలా:,సంబందినస్తదా :(34)
ఏతాన్న హన్తుమిచ్చామి ఘ్నతోపి మధుసూదనా ,,
అపి   త్రైలోక్య రాజ్యస్య హేతో:కిం ను మహీకృతే (35)

ఇట్టి ప్రేమ గల బ0దువులను చంపలేను  , , మూడు లోకాల ఏమిటి ,లేదా నన్ను చంపినా గాని నేను ఇట్టి పని చేయను, కేవలము భూమి కొరకు నేను వీరి ప్రాణాలు తీయ పణం గా పెట్టలేను .

నిహత్య ధార్త రాష్టా న్నా :కా ప్రీతి:స్యాజ్  జనార్దన:
పాపమేవా శ్రయెదస్మాన్ హత్వైటానాత తాయిన:(36)
జనార్దనా  ధృత రాష్ట్రుని పుత్రులను చంపితే పాపమే దక్కుతుంది .
మేన మామలు పిల్లను ఇచ్చిన మామలు తాతలు తండ్రులు పిన తండ్రులు పుత్రులు ఇంట మంది స్వజనులను నేను చంపలేను . నా కారణమున వీరి అందరిని మ్రుత్యవు కు అప్పగించాలేము ,పాపము   చేయలేను

తస్మాన్నార్హా వయం హంతు ధార్త రాష్ట్రాన్ స్వబాన్ధవాన్,
స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యాం మాధవా     (37)
మన స్వజనులను చంప గలిగినట్టి వారము మేము కాదు , ధృ త రాష్ట్రుడు మా కుటుంబీకుడు . వారి , పిల్లాలను చంపి మేము సుఖముగా ఉండ లేము .

(ఇక్క డ దుర్యోధనుని , మరియు అర్జునుము మనస్సు మన కు అవగతము ఔతున్నది . ఏమిటి అంటే , దుర్యోధనుడు తమకొరకు ఇంత  మంది ప్రాణాలు అర్పించేవారున్నారని ఆనంద పడుతుంటే , అర్జును డే మో , ఇంత  మంది స్వజనులను మన సుఖము కొరకు
చంపుతానా ?అని వారి కొరకు బాధ పడుతున్నాడు . ఇదే కరుణ గలిగిన వాడే రాజు .
దుర్యోధనుడు స్వార్థము తో స్వజనులను మరణింప చేయటానికి ఉత్సాహ పడుతున్నాడు . )  

యద్యప్యేతే న పశ్యతి లోభోపహతచేతస :
కులక్షయం దోషం మిత్ర ద్రోహే చ పాతకం             (38)
కథం న ఘ్యెయ్ మస్మాభి:పాపాదస్మాన్నివర్తితుమ్
కుల క్షయ కృతం దోషం ప్రపష్యద్భిర్జనార్దనం         (39)

వీరు భ్రష్టు లై నారు . వీరు మిత్ర ద్రోహం ,కుల నాశనం ను చూడ లేక యుద్ధానికి సంసిద్ధులై
ఉన్నారు.  కాని మేము ,ఈ దోషాలను చూడ గలుగుతున్నాము ,  మనము  ఈ పాపమును తప్పించుకోవచ్చు కదా !

కల క్షయే ప్రణ శ్యంతి కుల ధర్మా :సనాతనా :
ధర్మే నష్టే  కులం కృత్స్నమధర్మొ ,...భి భవత్యుత (40)

కుల నాశనము తో మన సనాతన కుల ధర్మాలు నశించి పోతాయి. ధర్మమూ నశిస్తే పాపాలు
పెరుగుతాయి . కుల మర్యాదలు పాటించుట మూలముగా పాప భీతి ఉంటుంది . సదాచారము కాపాడ బడుతుంది . కుల నాశము ఐతే చెప్పటానికి పెద్ద   వారు ఉండరు .

ఐదు రకాల భయాలు మనుషుల లో పాపా భీతిని ఉంచుతుంది ,ఈశ్వరుని పట్ల భీతి దేవునికి నచ్చదు అని మనము పాపమూ చేయ కుండా ఉంటాము .

శాస్త్రాల శాసనాలు , ప్రభుత్వ పరమైన భీతి ,కుల మర్యాదలు , పరువు పోతుదేమో నాన్న భయము ,
ఆర్తీక నష్ట భయము ,ఇందు వలన మనము కట్టు దితాలలో ఉంటూ , మేలుగుటాము .

ఈ భయాలు లేనిచో విచ్చల విడిగా ఉంటూ ,మనకు మనమే హాని తలపెదతాము .
అధర్మ భిభవాత్ కృష్ణా ప్రదుష్యన్తి కుల స్త్రియ:
స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయజాయతే వర్ణ సంకర:  (41)

స్త్రీలు మర్యాదను పాటించ కుంటే ,వర్ణ సంకరము కలుగుతుంది . ఆమె మాత  , పత్ని,సహోదరి ,పిల్లలను చక్కని క్రమ శిక్షణ తో పెంచే తల్లి , జీవిత విలువలు నేర్పే గురువు .
నిస్వార్థత వలన నే ఇవి సాధ్యము . పెద్దవారు లేకుంటే ఇవి తెల్పెవారు , లేనందున ఎవరి ఇష్టాన వారే నడుచుకొని ప్రమాదాలు తెచ్చుకునే అవకాశము ఉంటుంది కనక , అర్జునుడు , రాజు . భావి తరము క్షేమము గురించిన తపన యుద్ధ రంగములో సహితము గ్యాప్తికి ఉంది .

పితృ దేవతలా తర్పణము లలో బాధ ఏర్పడి ,శ్రాద్ధ కర్మలు సరిగా జరగవు . కుల ధర్మాన్నే నమ్మని స్త్రీ ,ఎటువంటి  తప్పుడు పనినైన చేసే సంభావన ఉంటుంది . తమ పవిత్రతను కప్పడ లేని
స్త్రీ తమ పిల్లలకు మంచి నేర్పును ఇవ్వలేదు కదా !

సంకరో నరకాయైయ్ వ కులఘ్నానాం కులస్య చ ,
పతన్తి పితరో హ్యేషాం లుప్త పిందోడక క్రియా .          (42)

వంశాచారాన్ని అనుసరించే పిండో దకాలు ఇచ్చే క్రియ నశించి , పితృ దేవతల రుణాన పాడుతారు .  ఆ వంశ మందు జన్మించినందున తెల్పే క్రుతఘ్యత పూర్వకము గా వారికి, శుభాని కలిగించుమని ,ప్రార్థనా రూపాన తెల్పే ఈ క్రియకు విఘ్నము కలిగ,మనముచేయవలసిన మన బాధ్యతా మిగిలి పోతుంది .

దోషై రే తై :కులఘ్నానాం వర్ణ సంకర్ కారకై :
,ఉత్సాధ్యన్తె ,జాతి ధర్మా:కుల ధర్మాశ్చ్ శాశ్వతా: (43)
ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దనా ,
నరకే నియతం వాసో భవతీ త్యనుశుశ్రుమ      (44)
అహొబత మహత్పాపం కర్తుం వ్యవసితా వయం
యద్రాజ్య సుఖ్ లోభేన హన్తుం స్వజన ముద్యతా :(45)
యది మామప్రతీకార శాస్త్ర పాణ య :
ధార్త రాష్ట్రాన్ రాణే హన్యు స్తన్మే క్షేమ తరం భవేత్ (46)
పై శ్లోకాలలో అర్జునుడు రాజుగా ప్రజలను ఎంతగా మంచి క్రమము  లో ఉంచాలి అనుకుంటాడో అదే వ్యక్తము ఔతున్నది , మనము రాజులము అయ్యి  ఎంతటి తప్పును చేయబోతున్నాము !కులాలు , ధర్మా లు మన పూర్వీకులు పాటించినవి . వాటిని గౌరవించాలి , అపహాస్యము చేయ కూడ దు . తమ వంశీయులను గౌరవముతొ చూస్తూ వారి ధర్మాని మనము పాటించాలి ,మేము ఎంతటి తప్పును చేయ బోతున్నాము ? కృష్ణ పరమాత్మునితో మోర పెట్టుకుంటున్నాడు , ఒక పక్క అదే స్థితిని దుర్యోధనుడు తమ స్వార్థానికి వాడుకోటానికి సిద్ధముగా ఉన్నాడు మరో పక్క అర్జునుడు ఇటువంటి  పాపమా నేను చేయ పోతున్నాను ? అని విలపిస్తున్నాడు . నాకు వీరి చేతిలో మరణము వచ్చినా నాకు సమ్మతమే
సంజయౌవాచ ,
ఎవ ముక్త్వా అర్జునః సంఖ్యే రతోపస్త ఉపావిశత్
 విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మనసః   (47)

సంజయుడు ఈ విధముగా చెపుతున్నాడు , రణ  భూమిలో శోకము తో నున్న అర్జునుడు
గాండీ వమును పక్కకు పెట్టి పలు రకాల ఆలోచనలతో నలుగుతున్నట్టి  వాడి రథము లో వెనకకు కూలబడి పోయాడు . యుద్ధము వలన జరిగే నష్టాన్ని తలుచుకుంటూ ఇంతటి పాపము నేను చేయ లేను , అని .
**************************************************************************************
  ఓం తత్ సత్
నిర్గుణుడు నిరాకారుడైనట్టి పరమాత్ముని సాక్షాత్కారము చేయిన్చునట్టి  గీతా శాస్త్రము,యోగ శాస్త్రము  ,కృష్ణార్జున సంవాద యోగము , అను మొదటి అధ్యాయము .
ఓం నమో నారాయణాయ .
సంజయ ఉవాచ -
తం తథా కృపయా విష్ట మ్ అశ్రు పూర్ణ కులేక్ష్ణం  
విశీదంతవాక్య మువాచ మధుసూదనా    !!1!!

సంజయుడు దృ తరాష్ట్రునితో ఇలా  చెప్ప సాగెను , “మధుసూదనుడు , అశ్రుపూరిత నేత్రాలతో శోకయుక్తుడైన అర్జునునికి ధైర్యము చెప్పబోతున్నాడు , అతని మాటల్లో  రాజా అర్జునుణ్ణి ఆవహించిన మోహము పటాపంచలు చేసి యుద్ధానికి ప్రేరేపించ బోతున్నాడు . అర్జునుని సారథి కృష్ణ పరమాత్ముడు మీ వాళ్ళు వీరిని గెలువ లేరు . అన్న ధీమా అతని మాటల్లో ధ్వనిస్తున్నది .   ,  

No comments:

Post a Comment